శ్రీదేవి తన కోరిక తీరకుండానే ఈ లోకన్ని విడిచివెళ్లిపోయారు. భర్త భోనీ కపూర్ నిర్మాత అయితే, బోనీ కపూర్ తమ్ముళ్లు అనిల్ కపూర్, సంజయ్ కపూర్ ఇద్దరూ సినీ ప్రముఖులే. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ టాప్ హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ కొడుకు అర్జున్ కపూర్ కూడా హీరోగా బిజీగానే వున్నాడు. అలా ఇంటినిండా సినీ ప్రముఖులే వున్న కపూర్స్ ఫ్యామిలీ కావడంతో తన పెద్ద కూతురు జాహ్నవి కపూర్‌ని కూడా హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశించింది. అందుకోసమే మంచి అవకాశం వచ్చే వరకు వేచిచూసింది. జాహ్నవి కపూర్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ధడ్‌కన్ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది.
మరో నెల రోజుల్లో ధడ్‌కన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కానుంది అనగానే శ్రీదేవి ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం నిజంగా బాధాకరం. జాహ్నవిని హీరోయిన్‌గా చూడాలనే తన ఆఖరి కోరిక తీరకుండానే ఆ అతిలోక సుందరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం చూసి ఆమె అభిమానుల గుండే మరింత తరుక్కుపోతోంది.