YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని..తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సుధీర్ఘ లేఖ రాసారు.
Owaisi Vs KCR: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శతృవులు ఉండరని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఒకరినొనకరు తిట్టు కున్న రాజకీయ నేతలు.. రాజకీయ అవసరం ఏర్పడితే.. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకున్న సందర్భాలు కోకోల్లలు. తాజాగా మొన్నటి వరకు కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఎంఐఎం ఛీఫ్..ఆ పార్టీ అధికారంలోంచి దిగగానే.. వెంటనే ప్లేటు మార్చి కేసీఆర్ పై రెచ్చిపోతున్నాడు.
Telangana BJP: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి ..? భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి..! ఓవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. ఆ నిశ్శబ్దదం వెనుక ఏదైనా సీక్రెట్ దాగి ఉందా..! కాషాయ వర్గాలు చేరికలపై కామ్ గా ఉండటానికి కారణాలేమిటి..! ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది.
BJP: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదం వర్కౌట్ కాలేదు. వాళ్లు చెప్పిన దాని కన్నా.. దాదాపు 100 సీట్లు తక్కువగా వచ్చాయి. ఇక ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి.
AP Leaders Fire On KT Rama Rao: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు మండిపడుతున్నారు. 'ఎక్స్' వేదికగా కేటీఆర్ తీరుపై ఏపీకి చెందిన కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MP DK Aruna Fire On Revanth Reddy Protocol Issue: మహబూబ్‌నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రొటొకాల్ వివాదం సృష్టించింది. స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణకు ప్రభుత్వపరంగా ముఖ్యమంత్రి పర్యటనకు ఆహ్వానం పలకకపోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశంపై రేవంత్‌ను ఎంపీ అరుణ నిలదీశారు.
Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. కూటమి నేతృత్వంలో అపూర్వ విజయం సాధించిన బాబు ప్రస్తుతం అనేక సవాళ్లు ఉన్నాయి. తాజాగా తమిళనాడులో తెలుగు ప్రజల కోసం ఓ డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.
Lok Sabha Speaker: లోక్ సభకు స్పీకర్ గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. పార్లమెంట్ ప్రారంభమైన కొద్ది సేపటిలో ప్రొటెం స్పీకర్ గా ఉన్న భర్తృహరి మహతాబ్ .. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికను నిర్వహించారు.
Lok Sabha Speaker Election: భారత ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. సభా కార్య కార్యకలపాలను సజావుగా నడవడానికి స్పీకర్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ సారి మాత్రం స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతుంది.
JP Nadda: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైన జగత్ ప్రకాష్ నడ్డాకు (జేపీ నడ్డా) పదవి కాలం మరికొన్ని రోజుల్లో ముగయనుంది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆయన్ని కేంద్ర క్యాబినేట్ లోకి తీసుకున్నారు. తాజాగా ఈయనకు మరో కీలక పదవిని అప్పగించింది.
Bandi Sanjay Kumar Bows And Touched The Ground Of Karimnagar: కేంద్ర మంత్రిగా తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన బండి సంజయ్ ప్రత్యేకత చాటారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసి మోదీని గుర్తు చేశారు.
Lok Sabha Deputy Speaker: చంద్రబాబుకు నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇవ్వనున్నారా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర రాజకీయ వర్గాలు. దాదాపు 1999 తర్వాత కేంద్రంలో చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.
UP Lok Sabha Election Results 2024: తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తర ప్రదేశ్ ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. గత ఎన్నికల్లో 60కి పైగా సీట్లు సాధించిన బీజేపీ .. ఈ సారి సీట్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. అంతేకాదు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామ మందిరం నిర్మించిన అయోధ్యలోని ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఓడిపోవడంపై కాషాయ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై బీజేపీ హై కమాండ్ దృష్టి సారించింది.
Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా కేంద్రం మరో కీలక వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.
BJP Natitonal President: భారతీయ జనతా పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షురాలిగా వసుంధరా రాజే నియమితులు కానున్నారా.. ? నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా తదుపరి అధ్యక్షురాలిగా వసుంధరా పేరును ఫైనలైజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసినట్టు సమాచారం.
Kiran kumar Reddy: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించనుందా ? అంతేకాదు త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Lok Sabha Election Voting Percentage Top 5 List Here: విజయోత్సాహంపై ఉన్న టీడీపీకి వైఎస్సార్సీపీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ఓటింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన నివేదిక వైఎస్సార్సీపీ టాప్ 5లో ఉంది.
Jr NTR: చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ కు పిలవలేదా.. ? పిలిచిన రాలేదా ? అనే డౌట్స్ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జూనియర్ కు చంద్రబాబు నుంచి పిలుపు అందిందా.. ? అందినా తన బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయాడా.. ?
Babu Swearing Ceremony: చంద్రబాబు నాయుడు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా రెడీ అయింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు అమరావతికి క్యూ కట్టారు.
Rajya Sabha: 2024లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన రాజ్యసభ సెక్రటేరియట్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.