UP Lok Sabha Election Results 2024: ఉత్తర ప్రదేశ్ ఫలితాలపై బీజేపీ అధిష్ఠానం పోస్ట్ మార్టమ్..

UP Lok Sabha Election Results 2024: తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తర ప్రదేశ్ ఓటర్లు గట్టి షాకే ఇచ్చారు. గత ఎన్నికల్లో 60కి పైగా సీట్లు సాధించిన బీజేపీ .. ఈ సారి సీట్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. అంతేకాదు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా  రామ మందిరం నిర్మించిన అయోధ్యలోని ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఓడిపోవడంపై కాషాయ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై బీజేపీ హై కమాండ్ దృష్టి సారించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 18, 2024, 12:44 PM IST
UP Lok Sabha Election Results 2024: ఉత్తర ప్రదేశ్ ఫలితాలపై బీజేపీ అధిష్ఠానం పోస్ట్ మార్టమ్..

UP Lok Sabha Election Results 2024: ఉత్తర ప్రదేశ్ లో ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే.. ఢిల్లీలో వాళ్లదే అధికారం అన్నది ఎప్పటి నుంచో వస్తోంది. గత రెండు పర్యాయాలు ఉత్తర ప్రదేశ్ లో గణనీయమైన సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ 2024లో మాత్రం సగానికి సగం పడిపోయింది. 2014లో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించినపుడు అక్కడ భారతీయ జనతా పార్టీ 71 సీట్లు గెలిచింది. అటు మిత్ర పక్షం అప్నాదళ్ రెండు సీట్లను కలుపుకుంటే ఎన్డీయే 73 సీట్లతో విజయం సాధించింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, అప్నాదళ్ వంటి పార్టీతో పొత్తు పొట్టుకొని రంగంలోకి దిగింది. అపుడు యూపీలోని ఎస్పీ, బీఎస్పీ కూటమిగా కలిసి పోటీ చేసినా.. బీజేపీ దూకుడు ను తగ్గించలేకపోయాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 62 సీట్లతో విజయం సాధించింది. మరోవైపు మిత్రపక్షం అప్నాదళ్ రెండు సీట్లతో కలిపి 64 సీట్లను గెలుచుకొని రెండోసారి సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ.

కానీ 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్నాదళ్, ఆర్ఎల్డీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల గోదాలో దిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సగానికి 33 సీట్లకే పరిమితం అయింది. మిత్ర పక్షాలైన RLD 2 సీట్లు.. అప్నాదళ్ ఒక సీటులో విజయం సాధించింది. మొత్తంగా ఎన్డీయే కూటమి 36 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల కంటే దాదాపు 28 సీట్లు తక్కువ గెలిచింది. అది బీజేపీ పై తీవ్ర ప్రభావం చూపించింది. మరోవైపు రాజస్థాన్, హర్యానా, మహా రాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ ఈ ప్రతికూల ఫలితాలపై పోస్ట్ మార్టం  నిర్వహించనుంది.

ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ ఇలాంటి ఫలితాలు ఎందుకు వచ్చాయనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
 
ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని పార్టీ ఓటమికి 10 కారణాలను కమిటీ పేర్కొంది.
లోక్ సభలో పోటీ చేసే అభ్యర్థులు యోగితో పాటు నరేంద్ర మోడీ ఛరిష్మానే తమను గెలుపిస్తుందనే అతి విశ్వాసం కొంప ముంచిందని చెబుతున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న ఎంపీ అభ్యర్థులపై నెగిటివిటీని గుర్తించడంలో విఫలం కావడం. రాష్ట్ర ప్రభుత్వ సలహాలు కేంద్ర పట్టించుకోకపోవడం. అంతేకాదు పార్టీకి, అభ్యర్ధుల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఓటమికి గల  కారణాలుగా విశ్లేషిస్తున్నారు. ఎంపీలకు స్థానిక ఎమ్మెల్యేల మద్ధతు కొరవడటం... స్థానికంగా ఉండే నేతలను విస్మరించడం.. దళిత ఓటర్ల నుంచి మద్దతు లభించకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. మరోవైపు అగ్ర వర్ణ ఓటర్లు ఈ సారి బీజేపీకి దూరంగా జరగడం వంటివి  కూడా పార్టీ ఓటమికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందన్న కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని సరైన విధంగా  తిప్పికొట్టకపోవడం వంటివి  ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి కారణాలుగా  చెబుతున్నారు.మొత్తంగా పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించి 2027లో జరిగే యూపీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలే వ్యూహాన్ని ఇప్పటి నుంచే అమలు చేస్తోంది బీజేపీ అధిష్ఠానం. మరోవైపు ఆర్ఎస్ఎస్ తో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని బీజేపీ హై కమాండ్ భావిస్తుంది. మొత్తంగా ఉత్తర ప్రదేశ్ తో పాటు రాబోయే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల పై కూడా బీజేపీ పెద్దలు దృష్టి సారించే పనిలో పడ్డారు.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News