Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?

Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా  కేంద్రం మరో కీలక వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 18, 2024, 10:23 AM IST
Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తెరపైకి మరో కొత్త పేరు.. ? కర్ణాటకకు నల్లారి..?

Telangana Governor: 2024 ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్టీయే సర్కారు ఢిల్లీలో కొలువు తీరింది. ప్రధాన మంత్రితో పాటు మరో 71 మంది కేంద్ర  మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అందులో 30 మంది క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మరికొంత మంది స్వతంత్య్ర హోదాతో పాటు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల గవర్నల్లు లోక్ సభకు పోటీ చేసారు. అందులో తెలంగాణ గవర్నర్ తమిళ సై తమిళనాడులోని చెన్నై సౌత్ నుంచి ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాటు కొత్త స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. ఇవన్నీ కొలిక్కి వచ్చే లోపు జూలై 1 లోగా ఇంచార్జ్ గవర్నర్ లుగా ఉన్న స్థానాల్లో కొత్తవారికి నియమించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ముందుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతేకాదు ఈయన  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి సీఎంగా పనిచేయడంతో పాటు ఇక్కడ పుట్టి పెరిగారు. అంతేకాదు ఇక్కడ ప్రాంతంపై పూర్తి పట్టుంది. అందుకే ఆయన్ని నియమించాలని ముందుగా అనుకున్నారు.

తాజాగా కిరణ్ కుమార్ రెడ్డిని కర్ణాటక గవర్నర్ గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బిహార్ కు చెంది ప్రముఖ నేత మోడీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న అశ్విని కుమార్ చౌబే ను తెలంగాణ గవర్నర్ గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.  ఈయన రామ మందిరం నిర్మాణంలో కూడా కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు మోడీ గత క్యాబినేట్ లో సహాయ  మంత్రిగా పనిచేసారు. 1953లో జన్మించిన ఈయనకు ఆర్ఎస్ఎస్ తో మంచి అనుబంధమే ఉంది.

మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు  కదుపుతున్న భారతీయ జనతా పార్టీకి తమకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిని గవర్నర్ గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా  ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 8 పార్లమెంట్ స్థానాలు గెలవడంతో గెలుపుపై నమ్మకం ఏర్పడింది. అందుకే బీజేపీ పెద్దలు కట్టర్ హిందువుగా పేరున్న అశ్వినీ కుమార్ చౌబే ను తెలంగాణ గవర్నర్ గా నియమించి రాజకీయంగా ఇక్కడ పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉంది. మరి బీజేపీ పెద్దలు వ్యూహాలు తెలంగాణలో ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News