బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వలసపోయిన వలసకూలీలు ( Migrant workers ) లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఉన్న వలస కూలీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ( Good news for migrant workers ) చెప్పింది.
బెంగళూరులో నిర్మాణరంగంలో కూలీ పనిచేసుకుంటున్న 28 ఏళ్ల హరిప్రసాద్.. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో సొంతూరుకి బయల్దేరాడు. బెంగుళూరు నుంచి కాలినడకనే 150 కిమీ మేర ప్రయాణించాడు. సొంతూరికి దగ్గర్లోకి వచ్చాకా అలసిపోయి కుప్పకూలి మృతి చెందాడు.
హీరోయిన్ రష్మిక మందన్న మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. కర్నాటకకు చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ లోని తన ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రష్మిక నివాసం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.25 లక్షల నగదు, వివిధ ఆస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నాడు అమరావతిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేటి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనూ ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.