బెంగళూరు : బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇంకెక్కడికో వలసపోయిన వలసకూలీలు ( Migrant workers ) లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో పనిలేకపోవడంతో కూడబెట్టుకున్న కొద్దిపాటి సొమ్ము కూడా ఖర్చయిపోయిందని.. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి సొంతూళ్లకు ఎలా వెళ్లాలని వలసకూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటకలో ఉన్న వలస కూలీలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వగ్రామాలకు వెళ్లిపోవాలనుకునే వలసకూలీలు, లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన ఇతర ప్రాంతాల వాళ్లు ( Stranded people ) వారి సొంతూళ్లకు వెళ్లేందుకు అయ్యే ఖర్చును సర్కారే భరిస్తుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ( తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల )
కర్ణాటక నుంచి వెళ్లే శ్రామిక్ రైళ్ల ( Shramik special Trains ) ద్వారా మే 31 వరకు వారిని స్వస్థలాలకు తరలించేందుకు సహకరిస్తామని కర్ణాటక సీఎం బిఎస్ యెడ్యూరప్ప ( Karnataka CM BS Yedyiyurappa ) స్పష్టంచేశారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..