ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి అంబరీష్ కన్నుమూత

ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి అంబరీష్ కన్నుమూత

Last Updated : Nov 25, 2018, 09:59 AM IST
ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి అంబరీష్ కన్నుమూత

బెంగళూరు: ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్ర సహాయ మంత్రి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అంబరీష్ (66) కన్నుమూశారు. శనివారం సాయంత్రం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బెంగుళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చేరిన అంబరీష్.. అనంతరం చికిత్స పొందుతూ రాత్రి10.15 గంటలకు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా సేవలు అందించిన ఆయన అంతకన్నా ముందుగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర సమాచారం, ప్రసార శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. అంబరీష్‌కి భార్య, సినీనటి సుమలత, తనయుడు అభిషేక్ ఉన్నారు.

కన్నడనాట లెజెండరీ నటుడిగా పేరు తెచ్చుకున్న అంబరీష్ మృతిని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. శాండల్‌వుడ్ చిత్ర పరిశ్రమ అంబరీష్ మృతిపట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేసింది. అంబరీష్ ఆకస్మిక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి.. కర్ణాటకలో మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్టు స్పష్టంచేశారు. అంబరీష్ మృతిపై యావత్ భారతీయ చిత్ర, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు.

Trending News