Vimalakka Bahujana Bathukamma: ప్రతియేటా మాదిరి ఈ సంవత్సరం కూడా బహుజన బతుకమ్మను విమలక్క నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున హుస్నాబాద్‌లో నిర్వహించిన బహుజన బతుకమ్మ వేడుకల్లో విమలక్క ఆడి పాడారు.
Bathukamma Kanuka 2024: తెలంగాణలో బతుకమ్మ అంటే అత్యంత వైభవంగా నిర్వహించుకునే రాష్ట్ర పండుగ. ఈ పండుగకు ఆడ బిడ్డలంతా ఒక్క దగ్గరకు చేరుకుని రంగురంగు పూలతో బతుకమ్మ పాటలు పాడుతూ నిర్వహించుకుంటారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఇంకా ఆ ఊసే లేదు.
Bathukamma Festival: నేటి నుంచి తెలంగాణలో అతిపెద్దదైన బతుకమ్మ పండగ జరుపుకోనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పూల సంబురం షురూ కానుంది. స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడంతో అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
Bathukamma Festival: చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ ఆడిపాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ చిందేశారు. విద్యార్థులతో కలిసి ఆమె ఆడిపాడారు.
Kukatpally Celebrates Bathukamma: ప్రకృతితో పెనవేసుకున్న తెలంగాణ బతుకమ్మతో మరింత శోభను సంతరించుకుంది. బతుకమ్మ సంబరాలకు ముందు రోజే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మహిళలు బతుకమ్మ ఆడారు. కాలనీ మహిళలంతా కలిసి ఒకచోట గుమిగూడి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో సందడి చేశారు.
Bathukamma Festival: బతుకమ్మ అంటే బతుకును ఇచ్చే అమ్మ. మనకు బతుకు తెరవును ఇచ్చే ఆ అమ్మలగన్న అమ్మను ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా పూజిస్తాము. తెలంగాణలో బతుకమ్మను ఎంతో వైభోవోపేతంగా జరుపుకుంటారు. భాద్రపద మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో ప ప్రారంభమయ్యే బతుకమ్మ పండగ.. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ యేడాది ఏయే తేదిలో పండగ జరుపుకుంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
Bathukamma 2023 Wishes In Telugu: బతుకమ్మ పండగ అంటే తెలంగాణ స్వరూపం.. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లోని చివరి రోజున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ రోజున మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే వారికి ఈ సందేశాలను సోషల్ మీడియా ద్వారా పంపండి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కారణంగా బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువును ఆయన పరిశీలించారు. వివరాలు ఇలా..
Bathukamma Festival Flowers: తెలంగాణ ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండక్కి వరుసగా పేరుచే పువ్వులు.. ప్రత్యేకత వాటి రంగులోనే కాదు వాటిలో దాగున్న ఔషధ గుణాల్లో కూడా ఉంది. మరి ఏ పువ్వుకి ఎటువంటి ఔషధ గుణం ఉంది. అవి ఎందుకు వాడుతారో తెలుసా?
తెలంగాణ అంతటా కూడా సోమవారం నాడు సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఈ క్రమంలో పల్లెలు, పట్నాలు అని తేడా లేకుండా బతుకమ్మ ఆటను ఆడారు తెలంగాణ మహిళలు. కామారెడ్డిలో పదిహేడు నెలల చిన్నారి తన చిట్టి చిట్టి చేతులతో బతుకమ్మను పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Bathukamma 2021 festival date, time and significance : దసరా నవరాత్రులు (Dussehra 2021) తరహాలోనే బతుకమ్మ పండగ కూడా 9 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే, కొన్ని చోట్ల బతుకమ్మ పండగను నవ రాత్రులలో తొలి రోజు, చివరి రోజు మాత్రమే జరుపుకుంటారు.
Complaint lodged against hyper aadi: జబర్ధస్త్ ఫేమ్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిథులు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజానీకం పవిత్రంగా భావించి, భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండగలో పూజించే గౌరమ్మ తల్లిని కించపరిచేలా జూన్ 13వ తేదీన ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ చేశారని, అది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేదిగా ఉందని టీజేఎస్ఎఫ్ నేతలు (TJSF) తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల సంబురం.. బతుకమ్మ పండుగ ( bathukamma festival ). ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని.. ప్రకృతి (పూలను) ని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులపాటు ఆరాధించడం ఈ బతుకమ్మ ( bathukamma ) పండుక ప్రత్యేకత.
ఓ వైపు పూల పండుగ బతుకమ్మ (Bathukamma).. మరోవైపు దేవీ శరన్నవరాత్రుల పూజలతో తెలంగాణ అంతటా సందడి నెలకొంది. అయితే ప్రకృతి పండుగ ( bathukamma festival ) ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) శుభాకాంక్షలు తెలిపారు.
Bathukamma is floral festival | మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ (Engili pula Bathukamma)తో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.