Teenmar Mallanna Joins BJP: తెలంగాణ ప్రభుత్వాన్ని విధానాలను తనదైన శైలిలో ఎండగడుతూ ప్రజల్లో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సీఎం కూర్చికోసం నాలుగు స్తంబాల ఆట ప్రారంభమైందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ మళ్లి అధికారంలోకి వచ్చే అకాశం లేదని జోస్యం చెప్పారు.
Bandi Sanjay reaction over arrests of BJP corporators: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగిన బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారు.
Telangana bjp chief bandi sanjay: సీఎం కేసీఆర్ దీక్ష పంజాబ్ రైతుల కోసమా? తెలంగాణ రైతుల కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన దీక్షకు సాగు చట్టాల ఉపసంహరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
BJP Telangana President Bandi Sanjay : కేసీఆర్‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా.. కొనరా అని అడిగామని.. ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని బండి ప్రశ్నించారు.
Telangana Minister KTR sensational comments: బండి సంజయ్ రెండు చెంపలు పగలకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. బుధవారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో వర్షాకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు.
High tension in Bandi Sanjay Suryapet tour : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. టీఆర్ఎస్ శ్రేణులు ఆయన్ను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Bandi Sanjay Nalgonda tour: బండి సంజయ్ నల్గొండ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల జెండాలు ప్రదర్శించి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేతలు కూడా పోటాపోటీ నినాదాలు చేయడంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
Bandi Sanjay: రాష్ట్రంలో వరి పంట కొనుగోలు విషయమపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు, ఎల్లుండి నల్గొండ, సూర్యపేటలో పర్యటించనున్నారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్ వేదికగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Bandi Sanjay vs CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు.
BJP vs TRS: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వత అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విమర్శల జోరు పెంచింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Amit Shah Nirmal meeting speech highlights, September 17 in Telangana history: సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సంగా అధికారికంగా నిర్వహిస్తాం అని ప్రకటించిన కేసీఆర్ వాగ్దానం ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరికి భయపడుతున్నాడు ? ఎందుకు భయపడుతున్నాడు ? తెలంగాణ నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు నిర్మల్‌లో (Nirmal) 1000 మందిని ఉరితీసిన విషయం సీఎం కేసీఆర్‌కు గుర్తురావడంలేదా అని నిలదీశారు.
Motkupalli Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకునే విషయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదన్న మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్ లాంటి అవినీతిపరుడిని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తంచేశారు.
Bandi Sanjay about CM KCR's districts tours: హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీజేపికి భయపడ్డారని, అందువల్లే ఇటీవల గడీల నుంచి బయటికి వచ్చి జిల్లాల్లో పర్యటిస్తున్నారని బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు (Huzurabad bypolls) సహా వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపికే పట్టం కట్టబోతున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
TTDP chief L Ramana party change news:హైదరాబాద్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని, ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలిసి మంతనాలు జరపగా.. వారికి రమణ సానుకూలంగా స్పందించారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈటల రాజేందర్ (Etela Rajender) పార్టీ వీడటంతో ఖాళీ అయిన బీసీ నేత స్థానాన్ని ఎల్ రమణతో భర్తీ చేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ వినిపించింది.
Harish Rao slams Etela Rajender:హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో మంత్రి హరీష్ రావు తన కంటే ఎక్కువ అవమానాలపాలయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. Etela Rajender తనకు నైతిక బలం, మద్దతు పెంచుకోవడం కోసం నా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటే అది ఆయన పొరపాటే అవుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు.
Tolivelugu journalist Raghu arrested: సూర్యాపేట: తొలివెలుగు జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు ఆయన్ను గురువారం హుజుర్ నగర్ సివిల్ జడ్జి ఎదుట హజరుపర్చారు. గుర్రంపోడు భూముల కేసులో గతంలో జర్నలిస్టు రఘుపై కేసు నమోదైందని, ఆ కేసు విచారణలో భాగంగానే రఘును అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని మఠంపల్లి పోలీసులు తెలిపారు.
Etela Rajender to join BJP: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయనతో పడని బీజేపి నేతలు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) తనదైన స్టైల్లో స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.