Tolivelugu journalist Raghu arrest: తొలివెలుగు జర్నలిస్ట్ రఘుకు 14 రోజుల రిమాండ్

Tolivelugu journalist Raghu arrested: సూర్యాపేట: తొలివెలుగు జ‌ర్న‌లిస్ట్ ర‌ఘును అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు ఆయన్ను గురువారం హుజుర్ న‌గ‌ర్  సివిల్ జడ్జి ఎదుట హ‌జ‌రుప‌ర్చారు. గుర్రంపోడు భూముల కేసులో గ‌తంలో జర్నలిస్టు ర‌ఘుపై కేసు న‌మోదైంద‌ని, ఆ కేసు విచారణలో భాగంగానే రఘును అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని మ‌ఠంప‌ల్లి పోలీసులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2021, 08:03 AM IST
Tolivelugu journalist Raghu arrest: తొలివెలుగు జర్నలిస్ట్ రఘుకు 14 రోజుల రిమాండ్

Tolivelugu journalist Raghu arrested: సూర్యాపేట: తొలివెలుగు జ‌ర్న‌లిస్ట్ ర‌ఘును అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు ఆయన్ను గురువారం హుజుర్ న‌గ‌ర్  సివిల్ జడ్జి ఎదుట హ‌జ‌రుప‌ర్చారు. గుర్రంపోడు భూముల కేసులో గ‌తంలో జర్నలిస్టు ర‌ఘుపై కేసు న‌మోదైంద‌ని, ఆ కేసు విచారణలో భాగంగానే రఘును అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని మ‌ఠంప‌ల్లి పోలీసులు తెలిపారు. ఈ కేసులో రఘుకు న్యాయమూర్తి 14రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను మఠంపల్లి పోలీసులు హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించారు.

అంతకంటే ముందుగా రఘు అరెస్ట్ (Tolivelugu journalist Raghu arrested) విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రఘను ఉదయమే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారని, హైదరాబాద్ శివార్లలోని పలు భూములపై ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం చేయడాన్ని జీర్ణించుకోలేకే రఘును కిడ్నాప్ చేశారని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ర‌ఘు అరెస్టుపై మఠంపల్లి పోలీసులు ఓ ప్రకటన చేయడంతో రఘుది కిడ్నాప్ కాదు అరెస్ట్ అని క్లారిటీ వచ్చింది. రఘు భార్య‌ లక్ష్మీ ప్రవీణకుకు సైతం అరెస్టుపై స‌మాచారం అందించామని పోలీసులు తెలిపారు.  

tolivelugu-journalist-Raghu-arrested-FIR.jpg

Also read: Digital survey: తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే లేటెస్ట్ అప్‌డేట్స్

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా (Gurrampodu land disputes issue) 540 సర్వే నంబర్‌లో ఉన్న భూముల విషయంలో తలెత్తిన ఘర్షణకు సంబంధించిన కేసులో రఘును పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు. 

ఇదిలావుంటే, ఈ ఘటనను పలు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని, గూండాలు రాజ్యమేలుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

Also read : Etela Rajender: ఈటల రాజేందర్ చేరికపై BJP MLA Raja Singh ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News