కేసీఆర్‌‌కు భయపడే ప్రసక్తే లేదు : బండి సంజయ్

BJP Telangana President Bandi Sanjay : కేసీఆర్‌‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా.. కొనరా అని అడిగామని.. ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని బండి ప్రశ్నించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 10:00 PM IST
  • కేసీఆర్ హుందాతనాన్ని తగ్గించుకోవద్దన్న బండి
  • కేసీఆర్‌‌కు భయపడే ప్రసక్తే లేదు
  • ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్న బండి
కేసీఆర్‌‌కు భయపడే ప్రసక్తే లేదు : బండి సంజయ్

BJP Telangana President Bandi Sanjay comments on CM KCR: సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు భయపడమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Telangana President Bandi Sanjay). కేసీఆర్ హుందా తనాన్ని తగ్గించుకోవద్దని సూచించారు. కేసీఆర్‌‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా.. కొనరా అని అడిగామని.. ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని బండి ప్రశ్నించారు. కేసీఆర్ (KCR) స్పందించకపోవడంతోనే  తాము రైతుల (farmers) దగ్గరకు వెళ్లామన్నారు. తాము రైతులతో మాట్లాడుతుండగానే రైతులపై టీఆర్ఎస్ నేతలు (TRS leaders) రాళ్లు, కోడిగుడ్లు వేశారన్నారు. రైతుల చేతిలో రాళ్లు, కోడిగుడ్లు ఉంటాయా అంటూ బండి ప్రశ్నించారు. 

Also Read :వైరల్ పిక్: పడగవిప్పిన మూడు పాములు.. ఆశీర్వాదం అనుకో అంటున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్

ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు బండి ఆరోపించారు. కొనుగోళ్లు సరిగా సాగితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ బండి సంజయ్ (Bandi Sanjay)ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనేది కేంద్రం లక్ష్యమని బండి స్పష్టం చేశారు. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్‌‌ను.. ధర్నా చౌక్ లో ధర్నా చేసే స్థితికి తీసుకొచ్చామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Also Read :బండి సంజయ్‌ రెండు చెంపలు పగలగొట్టాలి : కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

 

Trending News