Bandi Sanjay: కార్పోరేటర్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతేంటి..

Bandi Sanjay reaction over arrests of BJP corporators: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగిన బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖండించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 08:13 PM IST
  • బీజేపీ కార్పోరేటర్ల అరెస్టులపై స్పందించిన బండి సంజయ్
    వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్
    జీహెచ్ఎంసీ పాలనను మేయర్ గాలికొదిలేశారని విమర్శలు
Bandi Sanjay:  కార్పోరేటర్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతేంటి..

Bandi Sanjay reaction over arrests of BJP corporators: హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అరెస్ట్ చేసిన కార్పోరేటర్లను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు అన్న కనీస గౌరవం లేకుండా పోలీసులు బీజేపీ కార్పోరేటర్ల (BJP Corporators) పట్ల దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో కార్పోరేటర్ల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతేంటని ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీ (GHMC) పాలకవర్గం ఏర్పడి దాదాపు ఏడాది గడిచినా ఇప్పటివరకూ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. కరోనా సాకుతో నామమాత్రంగా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. కార్పోరేటర్లకు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ అందుబాటులో ఉండటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే జీహెచ్ఎంసీని నడిపించాలనుకుంటే... ఇక దానికి ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. 

రాజకీయాల పేరుతో అభివృద్దిని అడ్డుకోవడం సమంజసం కాదని...  బీజెపి కార్పొరేటర్లకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించకపోవడం అప్రజాస్వామికమని బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని అన్నారు. 74వ రాజ్యాంగ సవరణను టీఆర్ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని... పాత బిల్లులే ఇప్పటికీ చెల్లించలేదని అన్నారు. ఇలాగైతే కొత్త పనులు ఎలా చేయించగలరని ప్రశ్నించారు. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి పోకడలు మానుకోవాలన్నారు.

Also Read: Priyanka Gandhi Hyderabad Visit: రేపు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ-కుమారుడికి కంటి చికిత్స

బీజేపీ కార్పోరేటర్లు, కార్యకర్తలు మంగళవారం (నవంబర్ 24) ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు బీజేపీ శ్రేణులను (Telangana BJP) పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజా సమస్యలను మేయర్ పట్టించుకోవట్లేదని...పాలకమండలి కొలువుదీరి దాదాపు ఏడాది కావొస్తున్నా నగరంలో ఎలాంటి అభివృద్ది పనులు జరగట్లేదని బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News