APY Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఉద్యోగులకు సైతం సామాజిక భద్రత కల్పిస్తోంది. దీనిలో భాగంగానే అటల్ పెన్షన్ యోజన తీసుకువచ్చింది. ఈ స్కీములో చేరిన వారి సంఖ్య ప్రస్తుతం 7కోట్లకు చేరుకుంది. ఈ స్కీంకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. తక్కువ పెట్టుబడితో మంచి ప్రయోజనాలు అందించడమే ఇందుకు కారణం. నెలకు రూ. 5వేలకు వరకు పెన్షన్ కూడా పొందవచ్చు. మరి ఈ స్కీమ్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు పెన్షన్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరిన కార్మికులు 60 సంవత్సరాల వయస్సు తర్వాత పెన్షన్ రూపంలో అందుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.