ఎన్డీయే కూటమితో దాదాపు సంబంధాలు తెంచుకున్న చంద్రబాబు..ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తమ మద్దతిచ్చే వారి విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే చంద్రబాబు ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకుంటారని రాజకీయావర్గాల నుంచి సమాచారం.
కేసీఆరే చంద్రబాబుకు దిక్కు
కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ పై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మోడీ సర్కార్ పై విరుచుకుపడిన చంద్రబాబు.. జాతీయ రాజకీయాల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తానూ జాతీయ రాజకీయాలను దగ్గర నుంచి చూశానని ..కేంద్ర పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించిన సందర్భాలున్నాయని వ్యాఖ్యనించారు.
పోలవరం విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీపై ఎదురు దాడికి బీజేపీ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై నమ్మకంతో ప్రాజెక్టు అప్పగిస్తే ఇంత పని చేస్తారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించాల్సింది పోయి.. కేంద్రంపై విమర్శలు చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కేంద్రం వద్ద టీడీపీ అసలు విషయాలను దాచి పెట్టి.. కేవలం సాంకేతికపరమైన అంశాలతో లేఖను రాయడం తగదని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హచ్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు జగన్ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ తీరుపై సోషల్ మీడియాలో ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ను చదివి వినిపించాలని మంత్రి కాల్వ శ్రీనివాసులని చంద్రబాబు కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.