అమరావతి: ఏపీ శాశ్వత సచివాలయ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. భవనానికి సంబంధించిన ఐదు టవర్లకు ర్యాప్ట్ ఫౌండేషన్ వేశారు. కాగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 13 అడుగుల లోతులో 4 మీటర్ల ఎత్తులో ర్యాప్ట్ పౌండేషన్ వేస్తున్నారు. 11 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తో ర్యాప్ట్ పౌండేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
మొత్తం 72 గంటల పాటు ఏకతాటిగా ఫౌండేషన్ పనులు జగనున్నాయి. పిల్లర్లు లేకుండా కాంక్రీట్ వేయడం దేశంలోని ఇదే తొలి సారి కావడం గమనార్హం. 225 మీటర్ల ఎత్తులో నిర్మించతలబెట్టిన సచివాలయం పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయంగా రికార్డు సాధించనుంది.కాగా క్యాఫ్ట్ పౌండేషన్ పనులను సీఆర్డీఏ పర్యవేక్షించనుంది. మూడు రోజుల్లో 11.50 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 20 రోజుల వ్యవధిలో శాశ్వత సచివాలయంలోని ఐదు బ్లాకులకూ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతీ ఆత్మగౌరవానికి సచివాలయ నిర్మాణం ప్రతికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
సచివాయ నిర్మాణం విశేషాలు:
* ప్రపంచంలోని ఎత్తైన సచివాలయంగా గుర్తింపు
* అత్యంత ఎత్తైన ఐదు టవర్లతో డయాగ్రిడ్ విధానంలో సచివాలయాన్ని నిర్మాణం
* 250 మీటర్ల ఎత్తులో భవనాల నిర్మాణాలు
* 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మాణం
* రూ.4890 కోట్ల వ్యయంతో సచివాలయ నిర్మాణం