మూడు రాజధానులు వద్దు .. అమరావతే ముద్దు అంటూ .. దాదాపు నెల రోజులకు పైగా పోరాడుతున్న అమరావతి రైతుల పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది. రోడ్లపై వంటావార్పులు.. మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు .. అసెంబ్లీ ఎదుట నిరసనలు .. ఇలా అన్నదాతలు పోరాటాన్ని ఉద్ధృతం చేస్తున్నారు.
ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అగ్గి రాజేస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములను త్యాగం చేసిన అన్నదాతలు ఆగ్రహోదగ్రులవుతున్నారు. దాదాపు 20 రోజుల కిందట మొదలు పెట్టిన అమరావతి ఉద్యమం క్రమక్రమంగా బలపడుతోంది.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతుల పాదయాత్ర.
తూళ్లూరు గ్రామం నుంచి అమరావతి సచివాలయం వరకు పాదయాత్రగా వచ్చిన రైతులు.
9 కిమీ మేర కొనసాగిన పాదయత్రలో పాల్గొన్న రైతులు, మహిళలు, విద్యార్థులు.
పోలీసులు అనుమతి నిరాకరించినా... పాదయాత్ర చేసేందుకు వెనక్కి తగ్గని నిరసనకారులు.
20 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నాం.. లేదంటే రైతులు ప్రాణత్యాగానికైనా వెనుకాడరని నిరసనకారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టించడంతో దీనిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ ముందు ఆయన మరో ప్రతిపాదన ఉంచారు.
ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయింది. రాత్రి నుంచి అంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన మూడు రాజధానుల ప్రకటన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ అమరావతిలో రైతులు, ప్రజా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుండగా... విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించింది.
అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ ఏడు రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. రోజు రోజుకు అమరావతి ఉద్యమం ఉద్ధృతమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.