Jadeja Press Conference: టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup 2021) శుక్రవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో (India Vs Scotland) స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తనకు ఎదురైన ప్రశ్నకు తనదైన శైలీలో చమత్కరించాడు. ఇప్పుడా వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bumrah T20 Record: టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah Wickets Record) అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
Dwayne Bravo Retirement: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Bravo Retirement) తన కెరీర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు పేర్కొన్నాడు. గురువారం శ్రీలంక-వెస్టిండీస్ మ్యాచ్(SL vs WI T20) అనంతరం రిటైర్మెంట్పై బ్రావో క్లారిటీ ఇచ్చాడు.
Sri Lanka Vs West Indies: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో శ్రీలంక చెలరేగిపోయింది. విండీస్‌పై (SL Vs WI) 20 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ పరాజయంతో వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండు పరాజయాలు మూట గట్టుకున్న టీమ్ ఇండియా.. ఎట్టకేలకు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలుత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన టీమ్ ఇండియా.. న్యూజిలాండ్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లోను ఆకట్టుకోలేకపోయింది. దీనితో టీమ్ ఇండియా సెమీస్ చేరడం అత్యంత క్లిష్టంగా మారింది.
Afghanistan Vs Namibia: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) రెండో విజయాన్ని నమోదు చేసింది అఫ్గానిస్థాన్ జట్టు. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై (Afghanistan Vs Namibia) 62 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సెమీస్ (T20 World Cup Semis) రేసులో అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది అఫ్గాన్ టీమ్.
Shane Warne criticize Steve Smith: ఆస్ట్రేలియా కీలక బ్యాటర్ స్టీవ్ స్మిత్‌పై.. ఆ దేశ మాజీ ఆటగాడు షేన్‌వార్న్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు దుమాం రేపుతున్నాయి. అతడిపై ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
IND Vs NZ Match Prediction: టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్ టీమ్ఇండియాకు (IND Vs NZ) చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే సెమీస్ ఆశలు దాదాపుగా గల్లంతైనట్లే. ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియా కథ దాదాపుగా ముగిసినట్లే అవుతుంది. సెమీస్ ఆశలు నిలబెట్టుకోవడం సహా ఈ మ్యాచ్‌లో గెలిచి కివీస్‌పై 18 ఏళ్లుగా ఉన్న చెత్త రికార్డును కోహ్లీ సేన చెరిపేయాలని చూస్తోంది.
Rashid Khan 100 Wickets: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan News) అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరిట ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేశాడు రషీద్ ఖాన్.
Babar Azam New record: టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును దాటుకుని.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కత్త ఘనతను సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరగులు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు.
David Warner: అస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్.. ఫుడ్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను ఇమిటేట్ చేశాడు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వార్నర్ చేసిన ఈ సరదా పనితో అక్కడున్న వారిలో నవ్వులు పూశాయి.
India Pak T20 Match: టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో వివాదం మొదలైంది. పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
India Vs Pakistan Match: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్ ఓడించలేదని అంటున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్‌లో తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
India Vs Pakistan Match: టీమ్ఇండియా యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ వల్ల టీ20 వరల్డ్ కప్‌లో (ICC T20 World Cup 2021) పాకిస్తాన్ టీమ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పాకిస్తాన్ కోచ్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్‌తో (KL Rahul News) పాటు ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant News) కూడా పాక్ జట్టు గెలుపులో అవరోధంగా మారొచ్చని తెలిపాడు.
క్రిస్ గేల్ రిటైర్మెంట్పై ఓ క్లారిటీ వచ్చింది. మరో రెండు టీ20 వరల్డ్ కప్‌లు ఆడిన తర్వాతే తాను రిటైర్ అవుతానని క్రిస్ గేల్ స్పష్టంచేశాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ వయస్సు 41 ఏళ్లు కాగా.. తనకు మరో ఐదేళ్లు క్రికెట్ ఆడేంత సత్తా ఉందని, 45 ఏళ్లకు ముందే క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని గేల్ తేల్చిచెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.