Dwayne Bravo Retirement: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Bravo Retirement) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నీ(T20 World Cup) ముగిశాక రిటైర్ అవనున్నట్లు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విండీస్ ఓటమి అనంతరం ఈ ప్రకటన చేశాడు.
"వీడ్కోలుకు సమయం వచ్చేసింది. 18 ఏళ్లుగా వెస్టిండీస్ జట్టులో ఆడుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. కానీ, కరీబియన్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తా" అని డ్వేన్ బ్రావో అన్నాడు.
మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గి అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్ పేరు నిలబెట్టుకున్నామని బ్రావో అన్నాడు. రెండు ట్రోఫీలు డారెన్ సామి కెప్టెన్సీలోనే పొందినట్లు గుర్తుచేసుకున్నాడు. గురువారం లంకతో మ్యాచ్ అనంతరం ఫేస్బుక్ లైవ్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు బ్రావో.
అయితే, టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) సెమీస్‌కు ఏమాత్రం అవకాశం లేని శ్రీలంక జట్టు.. తన ఆఖరి గ్రూప్ మ్యాచ్లో అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్‌పై (SL Vs WI) 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్ సెమీస్ ఆశలపైనా నీళ్లు చల్లింది. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కరీబియన్ బ్యాటర్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేశారు. నికోలస్ పూరన్ (46), హెట్మెయిర్ (81) రాణించారు. లంక బౌలర్లలో ఫెర్నాండో, కరుణరత్నె రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
Also Read: Sri Lanka Vs West Indies: ఆఖరి మ్యాచ్లో అదరగొట్టిన శ్రీలంక.. వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతు
Also Read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతాలు జరగాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe