Warner imitate Ronaldo: రొనాల్డోను అనుకరించిన డేవిడ్​ వార్నర్​- ప్రెస్​ కాన్ఫరెన్స్​లో నవ్వులు!

David Warner: అస్ట్రేలియా బ్యాటర్​ డేవిడ్ వార్నర్.. ఫుడ్​బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను ఇమిటేట్ చేశాడు. ఓ ప్రెస్​ కాన్ఫరెన్స్ లో వార్నర్​ చేసిన ఈ సరదా పనితో అక్కడున్న వారిలో నవ్వులు పూశాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 02:58 PM IST
  • క్రిస్టియానో రొనాల్డో బాటలో డేవిడ్ వార్నర్​
  • ప్రెస్​ మీట్​లో కోక్ బాటిళ్లను దాచిన సరదా సంభాషణ
  • నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Warner imitate Ronaldo: రొనాల్డోను అనుకరించిన డేవిడ్​ వార్నర్​- ప్రెస్​ కాన్ఫరెన్స్​లో నవ్వులు!

Warner imitate Ronaldo: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్​ (David Warner) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ఓ సరదాపని ఇప్పుడు నెట్టింట చర్చనియాంశమైంది.

దిగ్గజ ఫుడ్​బాల్ ఆటగాడు.. క్రిస్టియానో రొనాల్డోను (Warner imitates Ronaldo) కాపీ కొట్టి చేసిన ఈ సరదాపని అందరిని నవ్వులు పూయిస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ఇంతకీ ఏమైందంటే..

దుబాయ్ వేదికగా జరుగుతున్న.. టీ20 వరల్డ్ కప్​ మ్యాచ్​లు ఉత్కంఠగా సాగుతున్నాయి. నిన్న (గురువారం) రాత్రి ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్ (Aus vs Sri lanka T20 match) జరిగింది. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా విజయం సాధించిన అనంతరం.. డేవిడ్ వార్నర్​ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. ఇందులో ఫుడ్​బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను ఇమిటేట్​ చేశాడు వార్నర్​.

డేవిడ్ వార్నర్ ముందు రెండు కోక్​ బాడిళ్లు, రెండు నీళ్ల బాటిళ్లు ఉండగా.. కోక్​ బాడిళ్లను తీసి కాసేపు దాచి (Coca cola bottles higing) ఉంచాడు. ఈ బాటిళ్లను తీసి పక్కన పెట్టొచ్చా? అని  అక్కడి సిబ్బందిని అడిగాడు వార్నర్​. ఇవి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందా? అని కూడా అన్నారు. వార్నర్ మాటలతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే వార్నర్ ఆ బాటిళ్లను మళ్లీ వాటి స్థానంలో పెట్టి.. మీడియాతో మాట్లాడారు.

 

Also read: David Warner IPL Auction: 'సన్ రైజర్స్ హైదరాబాద్ నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే'

Also read: T20 World Cup: తొలి ఓవర్ 1-0-2-3.. టీ 20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీఎస్ట్ ఓవర్ అంటున్న ఫ్యాన్స్

రొనాల్డో ఏం చేశాడంటే..

గతంలో.. ఓ మ్యాచ్​కు ముందు పోర్చ్‌గీసు ఫుడ్​బాల్​ జట్టు కెప్టెన్​  క్రిస్టియానో రొనాల్డో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ప్రెస్​ కాన్ఫరెన్స్​ను స్పాన్సర్​ చేసిన.. కోకకోలాకు.. ప్రమోషన్​లో భాగంగా రెండు కోక్​ బాటిళ్లను టెబుల్​పై ఉంచారు. అయితే రొనాల్డో ఆ రెండు కోక్ బాటిళ్లను తీసి పక్కకు పెట్టి.. వాటర్ బాటిల్​ను చూపిస్తూ.. 'మంచి నీళ్లు తాగండి' అంటూ మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. రొనాల్డో ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆటగాడిగా.. అందరికీ సుపరిచితం. అందుకే కోక్​ను అలా పక్కన పెట్టాడు.

Also read: Khel Ratna Award: నీరజ్, మిథాలీ సహా 11 మందికి ఖేల్ రత్న..ధావన్‌కు అర్జున అవార్డు!

అయితే ఈ రొనాల్డో చేసిన ఈ చిన్న పని వల్ల.. అప్పట్లో కోకాకోలా కంపెనీ మార్కెట్​ విలువ ఒక్క రోజులో దాదాపు రూ.29 వేల కోట్లు ఆవిరైంది.

దీని తర్వాత ఇలాంటి మరి కొన్ని సంఘటనలు జరిగాయి. కొంత మంది ఇతర ఆటగాళ్లు కూడా ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా డేవిడ్ వార్నర్ చేసిన పని మాత్రం సరదాగా ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. వార్నర్​ కూడా.. 'వీటిని తీసేయడం రొనాల్డోకు మంచిదైతే.. నాకూ మంచిదే' అంటూ ఫన్నిగా చెప్పడం గమనార్హం. 

Also read: T20 rankings: టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC.. దిగజారిన కోహ్లీ, రాహుల్ ర్యాంకులు!

Also read: T20 World Cup 2021: టీమిండియాతో మ్యాచ్ కు ముందు న్యూజిలాండ్‌కు షాక్..స్టార్‌ ఆటగాడు దూరం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News