Telangana COVID19 Cases:హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ ( Corona Virus ) వినాశనం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. బుధవారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1,018 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏడుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,357 చేరగా, మరణాల సంఖ్య 267కి పెరిగింది. (Also read Corona virus: కోవిడ్ 19 నివారణకు రాష్ట్రాలకు కేంద్రం తాజా సూచనలు)
788 మంది డిశ్చార్జ్
గత 24గంటల్లో 788మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 8,082 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 9,008 మంది రోగులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (Also read: ఏపీలో 15 వేలు దాటిన కరోనా కేసులు..)
ఒక్క హైదరాబాద్‌లోనే 881 కేసుల నమోదు..
బుధవారం హైదరాబాద్ పరిధిలోనే భారీగా 881 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్‌లో -36 కేసులు, రంగారెడ్డిలో -33, మహబూబ్ నగర్‌లో -10, వరంగల్ రూరల్‌లో -9, మంచిర్యాలలో -9, ఖమ్మంలో -7, నల్గొండలో -4, జగిత్యాలలో -4 , నిజామాబాద్‌లో -3, సిద్దిపేటలో -3, సంగారెడ్డిలో -2, కరీంనగర్‌లో -2, సూర్యాపేటలో -2, కామారెడ్డిలో -2, ములుగులో -2, అసిఫాబాద్‌లో -2, మెదక్‌లో -2, ఆదిలాబాద్‌లో -2, యాదాద్రిలో -2, గద్వాలో ఒక్క కేసు నమోదైంది. హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వినాశనం