Rajinikanth: జనవరిలో తలైవా రాజకీయ అరంగ్రేటం

సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొల‌గిపోయింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తలైవా పార్టీ పెడ‌తారా లేక మరెదైనా పార్టీలోకి చేరుతారా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.. అనే పలు ఊహాగానాలకు చెక్ పెడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

Last Updated : Dec 3, 2020, 02:14 PM IST
  • సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొల‌గిపోయింది.
  • జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు తలైవా ప్రకటన చేశారు.
  • ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు.
Rajinikanth: జనవరిలో తలైవా రాజకీయ అరంగ్రేటం

Rajinikanth to start new political party: చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ ( Rajinikanth ) రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొల‌గిపోయింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తలైవా పార్టీ పెడ‌తారా లేక మరెదైనా పార్టీలోకి చేరుతారా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.. అనే పలు ఊహాగానాలకు చెక్ పెడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు (Rajinikanth to start new political party) తలైవా ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు డిసెంబరు 31న వెల్లడిస్తానని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు. ప్ర‌జాద‌ర‌ణ‌తో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో త‌ప్ప‌క గెలుస్తాం. కుల‌మ‌తాల‌కు అతీతంగా నీతివంత‌మైన ఆధ్యాత్మిక  రాజ‌కీయాలను ప్రజలకు అందిస్తాను. అన్నింటిని మారుస్తాం. మార్పు ఇప్పుడు రాక‌పోతే ఇంకెప్పుడు రాదు అంటూ ర‌జ‌నీకాంత్ ట్విట్ చేశారు. 

అయితే.. కిడ్నీ మార్పిడి వ‌ల‌న ర‌జ‌నీకాంత్ ( Rajinikanth ) రాజ‌కీయాల‌లోకి ప్రవేశించరంటూ ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో త‌లైవా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన పార్టీ రజనీ మక్కళ్‌ మండ్రం (RMM) జిల్లా కార్యదర్శులతో  సమావేశమై చర్చించారు. అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తన నిర్ణయం ఏదైనా.. కార్యదర్శలు తనవెంటే ఉంటానని చెప్పారని.. వీలైనంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని వెల్లడిస్తానంటూ పేర్కొన్నారు. Also read: Kamal Haasan: రైతుల డిమాండ్లను ప్రభుత్వం వినాలి

ఈ తరుణంలోనే రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి (Rajinikanth political Entry) వస్తున్నట్లు ప్రకటించడంతో.. ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. న్యూ ఇయర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ తలైవా అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రజనీకాంత్ తమిళనాడు ( Tamil Nadu ) ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనుండటంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కనుంది. 

Also Read: Sasikala: త్వరలోనే చిన్నమ్మ విడుదల.. రూ.10 కోట్ల జరిమానా చెల్లింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News