Rajinikanth: రాజకీయాల నుంచి రజ‌నీకాంత్ వైదొలగనున్నారా..! క్లారిటీ ఇచ్చిన తలైవా

Rajinikanth Leaked Letter over Political Journey |

Last Updated : Oct 29, 2020, 03:06 PM IST
Rajinikanth: రాజకీయాల నుంచి రజ‌నీకాంత్ వైదొలగనున్నారా..! క్లారిటీ ఇచ్చిన తలైవా

 కోలీవుడ్ సూపర్ స్టార్ రజ‌నీకాంత్ రాజకీయాల నుంచి వైదొలగనున్నారా.. ప్రస్తుత కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి నేపథ్యంలో ఆయన అరంగేట్రం మొదలకముందే ముగియనుందా (Rajinikanth Political Journey Exit) అనే అనుమానాలు మొదలయ్యాయి. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు రజనీకాంత్ ప్రకటించినట్లుగా ఓ లేఖ వైరల్ అవుతోంది. గత రాత్రి నుంచి ప్రచారంలో ఉన్న లేఖపై రజనీకాంత్ స్పందించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే తన ఆరోగ్యం గురించి వైరల్ అయిన లేఖలో పేర్కొన్న కొన్ని వివరాలు మాత్రమే నిజమేనన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిమానుల కోసం ఓ లేఖ విడుదల చేశారు. 

Dharani Portal: ఇకనుంచి ధరణిలో రిజిస్ట్రేషన్లు.. 10 నిమిషాల్లో పని పూర్తి

 

రజనీకాంత్ పేరిట ఏం ప్రచారం జరిగిందంటే..!
రజనీకాంత్ 2011లో మూత్రపిండాల సమస్యతో బాధపడ్డారని, ఈ సమస్యకు సింగపూర్ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారని ఆయన పేరిట వైరల్ అయిన లేఖలో ఉంది. 2016లో అదే సమస్య రావ‌డంతో అమెరికా వెళ్లి కిడ్నీ మార్పిడి చేయించుకున్నారని.. కోవిడ్19 నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ లేఖ బుధవారం రాత్రి నుంచి వైరల్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. 

 

 

క్లారిటీ ఇచ్చిన తలైవా...
నిన్నటి నుంచి వైరల్ అయిన లేఖ తాను రాసింది కాదని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం నిజం కాదని స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు గురువారం నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ లేఖ పోస్ట్ చేశారు. దాని ప్రకారం.. వైరల్ అవుతున్న లేఖ నేను రాయలేదు. నా అభిమాన సంఘాలతో చర్చించాక రాజకీయ పార్టీ ప్రకటనపై నిర్ణయం తీసుకుంటాను. 
ర‌జ‌నీ మ‌క్కల్ మండ్రమ్ స‌భ్యుల‌తో క‌లిసి చ‌ర్చించాక నా నిర్ణయం తీసుకుంటాను. అంతేకానీ, ఎవరితో చర్చించకుండా సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలని భావించలేదని తలైవా రజనీకాంత్ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News