ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు శ్రుతి మించి మాట్లాడుతున్నారని.. కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
వచ్చే 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్లి, అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మంగళవారం చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో ఇంకా యోగి ఆదిత్యనాథ్ హవా కొనసాగుతోంది. జులై 22 2017 తేదిన యూపీ నియోజకవర్గమైన సికిందరా ఎమ్మెల్యే మధురప్రసాద్ లాల్ మరణించడంతో.. ఆ ప్రాంతానికి సంబంధించి బైపోల్స్ను ఇటీవలే నిర్వహించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో ఆలయాలను సందర్శించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు.
కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మొబైల్ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయో ప్రజలకు వివరించి చెప్పేందుకు సరికొత్త బాటను ఎంచుకున్నారని కొందరు అంటున్నారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం ఓట్లలెక్కింపులో ఇప్పటికి 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 48 స్థానాల్లో ఓట్లలెక్కింపులో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఓట్ల లెక్కింపులో బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందుంది.
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ నేత ఒకరు స్వయాన తమ పార్టీపైనే విమర్శలు కురిపించారు. ఈ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్, బీజేపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీజేపీ నేత వరుణ్ గాంధీ ఓ సెమినార్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'నేను రెండు సార్లు ఎంపీగా గెలిచానంటే అందుకు కారణం.. నా పేరులో 'గాంధీ' ఉండడమేనని' ఆయన అభిప్రాయపడ్డారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదల అవుతున్న సందర్భంలో ఇప్పటికే వివిధ పత్రికలు, టీవి ఛానళ్లు, వెబ్సైట్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి సర్వే చేయడం గమనార్హం. వీటిని ఒకసారి పరిశీలించే చూస్తే.. గుజరాత్లో మోదీ సర్కారే మరల మెజారిటీ సాధించి, కాంగ్రెస్కు మంచి పోటీ ఇస్తుందని తెలుస్తోంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అయిదు నెలల్లో దాదాపు 80 వేల కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించిందని ఆయన అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.