అదంతా ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో ఆలయాలను సందర్శించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు.

Last Updated : Dec 23, 2017, 03:34 PM IST
అదంతా ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే..

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో ఆలయాలను సందర్శించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు.

"గుజరాత్ ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ నేతలు, బీజేపీ నాయకులు ఎన్నికలకు ప్రచారం చేయలేదు. కానీ ఎక్కువ సంఖ్యలో దేవాలయాలను సందర్శించటానికి ప్రయత్నించారు. అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికలు ప్రారంభం కాగానే, నేను కూడా వారికి 'యాత్ర' అంటే ఏమిటో చూపిస్తాను. ఎన్నికల ప్రచారాల్లో మసీదులు, దర్గాలను వెళ్తాను.. ఆకుపచ్చ జెండాను ధరిస్తాను. వారిద్దరూ కాషాయం దుస్తులు ధరించినా పట్టించుకోము. కానీ నేను ఆకుపచ్చ ధరిస్తాను" అని ఒవైసి తన మద్దతుదారులకు చెప్పారు. "రాహుల్ జీ.. మీకు గుళ్లు, గోపురాలు మాత్రమే కనిపిస్తాయా? మసీదులు, ముస్లింలు కంటపడరా?"  అని రాహుల్ ను ప్రశ్నించారు.

" పార్టీకో రంగును పులుముకొని మత రాజకీయాలు చేస్తున్నాయ్. అవి తలుచుకుంటే ఏమీ చేయలేవ్. కానీ మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాం. దెబ్బకు కాంగ్రెస్, బీజేపీ గమ్మునుంటాయ్.." అన్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లో సబర్మతి నుంచి ధరోయ్ డ్యాం వద్దకు చేరుకోవడానికి ప్రధాని మోదీ సముద్రవిమానం ఎక్కడాన్ని ఒవైసి ఎగతాళి చేశారు. డిసెంబరు 12న ప్రధానమంత్రి మోదీ, రాహుల్ గాంధీ ఒకపక్క గుజరాత్ లో ఆలయాలను దర్శించి ఆశీర్వాదాలు తీసుకుంటూ.. మరోపక్క  ఓటర్లను లక్ష్యం చేసుకున్నారన్నారు.

రాహుల్ నేడు గుజరాత్ లో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కొత్తగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలతో, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

Trending News