ఎక్కువగా మాట్లాడితే.. బీజేపీతో పొత్తు మాకు అక్కర్లేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు శ్రుతి మించి మాట్లాడుతున్నారని.. కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Last Updated : Jan 29, 2018, 08:26 AM IST
ఎక్కువగా మాట్లాడితే.. బీజేపీతో పొత్తు మాకు అక్కర్లేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు శ్రుతి మించి మాట్లాడుతున్నారని.. కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్నేహధర్మాన్ని పాటించి తాము మెలుగుతుంటే.. ఈ మధ్యకాలంలో రాష్ట్ర బీజేపీ నాయకుల వ్యవహారం సరిగ్గా లేదని.. ఆ పార్టీకి ఇష్టం లేకపోతే తమకు వారితో పొత్తు అక్కర్లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇటీవలే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వచ్చి, అత్యధిక ఆర్థిక అభివృద్దిని నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని.. అలాంటి  రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదని అనడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఏపీ తలసరి ఆదాయం 35వేలకు పెరిగితే మిగతా రాష్ట్రాలకు సమానంగా ముందుకు వెళ్తుందన్నారు.బీజేపీ అధిష్టానంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల పట్ల స్పందించాలని.. మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ సమానస్థాయికి చేరేవరకూ సహకారం అందించాలని ఆయన తెలిపారు. ఇటీవలే కొందరు బీజేపీ నాయకులు చంద్రబాబు నాయకత్వం సరిగ్గా లేదని.. వీలైతే తాము వైఎస్సార్‌సీపీతో కలసి పనిచేయడానికి సిద్ధం అని తెలిపిన నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News