రానున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ స్పష్టం చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారం కైవసం చేసుకున్న సందర్భంగా వైజాగ్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచారు. బైక్ ర్యాలీలు చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో బీజేపీ పార్టీ ఏపీలో కూడా అధికారంలో వస్తుందని, ప్రజలు అధికారంలో బీజేపీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నారని చెప్పారు. అయితే వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లో తెదేపాతో పొత్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు.