Womens IPL Auction 2023: ఐపీఎల్‌ 2023 వేలంకు ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడో తెలుసా?

BCCI to Organise Womens IPL Auction 2023 on February 11 or 13. వుమెన్స్‌ ఐపీఎల్‌ 2023 తొలి ఎడిషన్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 1, 2023, 05:53 PM IST
  • వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలంకు ముహూర్తం ఖరారు
  • వుమెన్స్‌ ఐపీఎల్‌ వేదిక ఎక్కడో తెలుసా
  • మార్చి 24 ఫైనల్ మ్యాచ్
Womens IPL Auction 2023: ఐపీఎల్‌ 2023 వేలంకు ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడో తెలుసా?

Womens Premier League 2023 Auction likely on February 11 or 13: వుమెన్స్‌ ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. మహిళల ఐపీఎల్ వేలం ప్రక్రియ 2023 ఫిబ్రవరి 11న లేదా 13న నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ముందు అనుకున్న విధంగా వేలం ప్రక్రియ ఫిబ్రవరి తొలి వారంలో కాకుండా రెండో వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం బీసీసీఐ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ వారం వేలం నిర్వహణపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మహిళల ప్రీమియర్ లీగ్ వేలాన్ని (Womens IPL Auction 2023) ఫిబ్రవరి 6న నిర్వహించాలని ముందుగా భావించినా.. బీసీసీఐ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలానికి సంబంధించి వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉందట. దేశ రాజధాని ఢిల్లీ లేదంటే వాణిజ్య రాజధాని ముంబైలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఫ్రాంచైజీలు బిజీగా ఉన్న కారణంగానే వేలం తేదీల్లో మార్పులకు కారణంగా తెలుస్తోంది.

వేలానికి (WPL Auction 2023) సిద్ధమయ్యేందుకు ఐపీఎల్‌లోని ఐదు ఫ్రాంచైజీలకు బీసీసీఐ నెల రోజుల సమయం కేటాయించింది. మహిళల ఐపీఎల్.. 2023 మార్చి 4న ప్రారంభం కానుంది. మార్చి 24 ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. వుమెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ 2023 తర్వాత ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి టీ20 ప్రపంచకప్‌ మొదలు కానుండగా.. ఫిబ్రవరి 26న ఫైనల్‌ మ్యాచ్ ఉంది. ప్రపంచకప్‌ ముగిసిన 5 రోజుల తర్వాత ఐపీఎల్ ఆరంభం కానుంది.

మహిళల ఐపీఎల్‌ తొలి సీజన్‌లో 22 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లను ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం, డీవై పాటిల్‌ అకాడమీలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అదానీ స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇండియా విన్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఎస్‌డబ్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్యాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రాంచైజీలు మహిళల ఐపీఎల్‌ తొలి సీజన్‌లో తలపడనున్నాయి.  

Also Read: ICC T20I Rankings: దుమ్ములేపిన సూర్యకుమార్‌ యాదవ్‌.. డేవిడ్ మలన్‌ ఆల్‌టైమ్‌ రికార్డుకు ఎసరు!  

Also Read: Suryakumar Yadav Record: భారత్, న్యూజిలాండ్‌ మూడో టీ20.. అరుదైన రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News