Virat Kohli: టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లి కెప్టెన్సీ పర్వం ముగుస్తోంది. నమీబియాతో మ్యాచ్ అనంతరం కెప్టెన్సీకు వీడ్కోలు పలకనున్నాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రయాణం విజయవంతమైందా లేదా విఫలమైందా.
టీమ్ ఇండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్స్(T20 World Cup Semifinals) నుంచి దూరమై ఇంటికి చేరనుండటమే కాకుండా కెప్టెన్ పదవికి విరాట్ కోహ్లీ కూడా దూరం కానున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 ముగిసిన తరువాత కెప్టెన్సీకు వీడ్కోలు పలకాలని గతంలోనే నిర్ణయించుకున్నాడు. టీమ్ ఇండియాకు(Team India)కెప్టెన్‌గా ఇదే చివరి అవకాశం కావడంతో ఎలాగైనా ప్రపంచకప్ సాధించి కోరిక నెరవేర్చుకోవాలనుకున్నాడు. అయితే ఆ కోరిక తీరకుండానే కెప్టెన్ కధ ముగిసిపోయింది. బ్యాట్స్‌మెన్‌గా సూపర్ సక్సెస్ సాధించిన విరాట్ కోహ్లి..కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడా అన్పిస్తోంది. ఎందుకంటే 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మొదలుకుని ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ వరకూ ఇప్పుడు టీ20 ప్రపంచకప్ వరకూ విరాట్ కోహ్లికి (Virat Kohli)విజయం కలిసి రాలేదు.
కెప్టెన్‌గా విరాట్ కోహ్లి(Virat Kohli as a Captain)
మొత్తం మీద విరాట్ కోహ్లి టీ20 మ్యాచ్‌లలో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా 31 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. 16 మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఓడిపోయింది. 63.27 శాతం కెప్టెన్సీ రికార్డు కలిగిన విరాట్ కోహ్లికు ఎందుకో ఐసీసీ టీ20 ఫార్మట్‌లో దురదృష్టమే వెంటాడింది. ఇక భవిష్యత్‌తో వన్డే, టెస్ట్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించేది కూడా అనుమానమే. 2023లో తిరిగి వన్డే ప్రపంచకప్ జరగనుంది. అటు బీసీసీఐ కూడా వన్డే కెప్టెన్సీలో మార్పులు చేసే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ, టీ20 బాధ్యతలు అప్పగించి విరాట్ కోహ్లికు టెస్ట్ కెప్టెన్సీకు పరిమితం చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. నవంబర్ 8వ తేదీన నమీబియాతో జరిగే టీ20 మ్యాచ్ విరాట్ కోహ్లీకు కెప్టెన్‌గా చివరిది. పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్ (Newzealand)చేతిలో దారుణ పరాజయం టీమ్ ఇండియా సెమీస్ అవకాశాల్ని దెబ్బతీసింది.
Also read: ICC T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ సెమీస్ ఎవరెవరికంటే..టీమ్ ఇండియా పరిస్థితి ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook