Anushka Sharma Pregnancy: గుడ్ న్యూస్.. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట..

Anushka Sharma-Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ హీరోయిన్ అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 30, 2023, 07:10 PM IST
Anushka Sharma Pregnancy: గుడ్ న్యూస్.. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట..

Virat Kohli-Anushka Sharma: విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. విరుష్క జంటకు వామిక అనే కూతురు ఉంది. త్వరలోనే  ఈ సార్ట్‌ కపుల్‌కు మరో సంతానం కలగనుంది. ప్రస్తుతం అనుష్క గర్భంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు విరుష్క కపుల్. అయితే తొందరలోనే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే నవంబరు 05న కోహ్లీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ శుభవార్తను ఫ్యాన్స్ తో పంచుకునే అవకాశం ఉందని వారి సన్నిహతులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు వామికా ఫొటోలను బయటపెట్టలేదు విరాట్, అనుష్క. 

అయితే అనుష్క కొన్ని రోజులగా పబ్లిక్ లో తిరగడం లేదు. అంతేకాకుండా కోహ్లీతో కలిసి స్టేడియానికి కూడా రావడం లేదు. ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయిన కారణంగానే బయట కనిపించడం లేదని సమాచారం. రీసెంట్ గా అనుష్క, విరాట్ జంట ముంబైలోని ప్రసూతి ఆసుపత్రిలో మీడియా కంట పడ్డారట. అయితే వారి ఫోటోలను ఎక్కడా ప్రచురించవద్దని ప్రోటోగ్రాఫర్స్ కు విరాట్ హెచ్చరించినట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తామని.. అప్పటి వరకు తమ ఫోటోస్ ఎవరికి షేర్ చేయవద్దని చెప్పారట. ఓ యాడ్ ఫిల్మ్ ద్వారా ఏర్పడిన పరిచయం వీరి ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రేమలో ఉన్న అనుష్క, విరాట్ 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2021లో వామిక జన్మించింది. 

Also Read: Pakistan Cricket Team: భారత ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు.. ఏమన్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News