Varinder Singh Dead: భారత హాకీ దిగ్గజం కన్నుమూత!

India hockey player Varinder Singh dead. భారత హాకీ దిగ్గజం, ప్రపంచకప్ సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడైన వారీందర్ సింగ్‌ కన్నుమూశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 28, 2022, 06:01 PM IST
  • భారత హాకీ దిగ్గజం కన్నుమూత
  • హాకీ ఇండియా సంతాపం
  • ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
Varinder Singh Dead: భారత హాకీ దిగ్గజం కన్నుమూత!

Legendary Indian hockey player Varinder Singh dies aged 75: భారత హాకీ దిగ్గజం, ప్రపంచకప్ సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడైన వారీందర్ సింగ్‌ (75) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వస్థలం జలంధర్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వారీందర్‌ సింగ్‌ మరణం పట్ల హాకీ ఇండియా సంతాపం తెలిపింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. వారీందర్‌ సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోతాయని, ఆయన లేని లోటు పూడ్చలేమని పేర్కొంది.

1947లో పంజాబ్‌లోని జలంధర్‌లో వారీందర్‌ సింగ్‌ జన్మించారు. చిన్నప్పటినుంచి ఆయనకు హాకీ ఆట అంటే చాలా ఇష్టం. ఆటపై మక్కువతో ఎంతో కస్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టులో చోటు సంపాదించారు. హాకీ ప్రపంచకప్ 1975 టోర్నీలో పాకిస్తాన్‌ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో వారీందర్‌ సభ్యుడు. 1972 నాటి మ్యూనిచ్‌ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో కూడా ఉన్నారు. 1973లో ప్రపంచకప్‌లో రజతం గెలిచిన జట్టులో ఆయన సభ్యుడు.

1974, 1978 ఏసియన్‌ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత జట్టుకు హాకీ దిగ్గజం వారీందర్‌ సింగ్‌ ప్రాతినిథ్యం వహించారు. భారత హాకీ స్టార్ 1975 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు. హాకీ ఆటగాడిగా క్రీడా రంగానికి చేసిన సేవకు గానూ 2007లో ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన అందుకున్నారు. 

Also Read: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా బ్యాటర్.. తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు!

Also Read: Nithya Menon Leg Fracture: నిత్యమీనన్ కు గాయాలు.. నడవలేని స్థితిలో హీరోయిన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News