/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Victoria Azarenka beats Serena Williams: న్యూఢిల్లీ: యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌లో ఫెవరేట్‌గా బరిలో దిగిన నల్ల కలువ సెరెనా విలియమ్స్‌ (Serena Williams) కు ఊహించని విధంగా షాక్ తగిలింది. గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోనే ఆమె వెనుదిరిగింది. శుక్రవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌‌లో సెరెనాను ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లేయర్‌, బెలారస్‌ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా (Victoria Azarenka) ఓడించింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా ఆర్థర్‌ ఆషే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్‌ పోరులో అజరెంకా ఊహించని విధంగా ప్రత్యర్థి సెరెనాపై విరుచుకుపడింది. మూడు సెట్ల మ్యాచ్‌లో అజరెంకా రెండు గెలుచుకుని ఫైనల్లోకి ప్రవేశించింది. Also read: Cricket South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు

1గంట 55నిమిషాలపాటు జరిగిన ఈ మూడు సెట్ల మ్యాచ్‌లో ప్రత్యర్థి సెరెనా విలియమ్స్‌ను 1-6, 6-3, 6-3 స్కోర్‌తో అజరెంకా ఓడించి ఫైనల్‌కు చేరింది. గ‌తంలో రెండు సార్లు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలిచిన అజ‌రెంకా.. యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో రెండుసార్లు సెరెనా చేతిలోనే ఓడింది. ప్రస్తుతం రిటైర్మెంట్ ఇద్ధామనుకుంటున్న సమయంలో..  సెరెనా దూకుడికి కళ్లెం వేసి దాదాపు ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అద్భుతమైన పామ్‌తో గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించి అజరెంకా అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే శ‌నివారం జ‌రిగే ఫైన‌ల్లో నవోమి ఓసాకాతో అజ‌రెంకా త‌ల‌ప‌డనుంది.  Also read: Parliament: చరిత్రలో నిలిచిపోనున్న పార్లమెంట్ సమావేశాలు

Section: 
English Title: 
US Open 2020: Victoria Azarenka stuns Serena Williams to set up Naomi Osaka showdown
News Source: 
Home Title: 

US Open 2020: నల్ల కలువకు షాక్.. ఫైనల్‌కు అజరెంకా

US Open 2020: నల్ల కలువకు షాక్.. ఫైనల్‌కు అజరెంకా
Caption: 
Image Credits: Twitter/@usopen
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
US Open 2020: నల్ల కలువకు షాక్.. ఫైనల్‌కు అజరెంకా
Publish Later: 
No
Publish At: 
Friday, September 11, 2020 - 12:21