Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?

Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 9, 2024, 04:54 PM IST
Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?

Mohammed Siraj: భారత క్రికెట్‌లో తన బౌలింగ్‌తో అద్భుతాలు సాధిస్తూ ప్రపంచకప్‌ సాధనలో కీలక భూమిక పోషించిన మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం అభినందించింది. ప్రపంచ కప్‌ సాధించడంతోపాటు అంతర్జాతీయ ఖ్యాతిలో తెలంగాణ సత్తా చాటుతున్న సిరాజ్‌ను రేవంత్‌ రెడ్డి అభినందించారు. ప్రపంచకప్‌ సాధించిన సిరాజ్‌ను అభినందించిన అనంతరం భారీ కానుకలు ప్రకటించారు.

Also Read: Virat kohli: విరాట్ కోహ్లి పబ్ పై పోలీసుల రైడ్.. కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

 

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్ రెడ్డిని టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా భారత జట్టు జెర్సీని రేవంత్ రెడ్డికి సిరాజ్‌ బహుకరించారు. 'అంతర్జాతీయ క్రికెట్‌లో దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని మొహమ్మద్ సిరాజ్ తీసుకువస్తున్నాడని ప్రశంసించారు. ఈ సందర్బంగా సిరాజ్‌ను ముఖ్యమంత్రి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని  ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Also Read: BCCI Prize Money: భారత జట్టుపై బీసీసీఐ కనకవర్షం.. ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు

 

ప్రపంచకప్‌ సాధించిన స్వదేశం వచ్చిన సిరాజ్‌ మియాకు ఊహించని స్వాగతం లభించింది. ముఖ్యంగా స్వస్థలం హైదరాబాద్‌లో సిరాజ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అతడి నివాసం వరకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సిరాజ్‌ను స్వాగతించారు. కాగా ఇటీవల సిరాజ్‌ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తుండగా వాటిని ప్రపంచకప్‌లో తన బంతితో సిరాజ్‌ బదులు చెప్పాడు. ప్రపంచకప్‌ తర్వాత కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ క్రికెట్‌ ఆడనున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News