Rohit Sharma Tests Covid 19 Positive: టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడ్డాడు. శనివారం (జూన్ 25) నిర్వహించిన యాంటీజెన్ పరీక్షల్లో రోహిత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇంగ్లాండులో టీమ్ బస చేస్తున్న హోటల్లోనే రోహిత్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ఆదివారం (జూన్ 26) రోహిత్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు రోహిత్ కరోనా బారినపడటం టీమిండియాను కలవరపెడుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అనుసరిస్తున్న ప్రోటోకాల్ ప్రకారం.. కోవిడ్ బారిన ప్లేయర్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన రోహిత్ జూన్ 30 వరకు ఐసోలేషన్‌లో ఉండాల్సి రావొచ్చు. ఆ మరుసటి రోజే ఇంగ్లాండుతో టెస్టు మ్యాచ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో రోహిత్ ఇంగ్లాండుతో టెస్టుకు దూరమవుతాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్పిన్నర్ అశ్విన్ కూడా ఇటీవల కరోనా బారినపడి ఆలస్యంగా ఇంగ్లాండ్ పయనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీచెస్టర్ జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో అతను పాల్గొంటున్నాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రాలేదు. అప్పటికే కరోనా లక్షణాలు కనిపించడంతో అతను బ్యాటింగ్‌కి దిగలేదని తెలుస్తోంది.
కాగా, ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య గతేడాది జరగాల్సిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ మ్యాచ్‌ను ఈ జూలై 1వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే టీమిండియా జట్టు ఇంగ్లాండ్ వెళ్లింది. ఈ టెస్టు సిరీస్‌లో 2-1తో లీడ్‌లో ఉన్న టీమిండియా చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది.
Also Read: SL Vs AUS: అరుదైన ఘటన.. స్వదేశంలో అస్ట్రేలియాకు సపోర్ట్ చేసిన శ్రీలంక ఫాన్స్!
Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.