Wankhede Pitch Curator: వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు నగదు బహుమతి.. అసలు కారణం అదే!!

రెండో టెస్టు విజయం అనంతరం భారత జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు రూ.35 వేల నగదు బహుమతిని అందజేసింది. మూడు రోజుల్లోనే మ్యాచును ముగించే వికెట్‌ను కాకుండా.. స్పోర్టింగ్ వికెట్‌ తయారు చేసినందుకు వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు టీమిండియా యాజమాన్యం నగదు బహుమానం ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 02:15 PM IST
  • వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు నగదు బహుమతి
  • కాన్పూర్‌ పిచ్‌ క్యూరేటర్‌కు నగదు బహుమతి
  • అజాజ్‌ పటేల్‌కు ఆర్ అశ్విన్‌ ప్రత్యేక కానుక
Wankhede Pitch Curator: వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు నగదు బహుమతి.. అసలు కారణం అదే!!

Team India Donates 35000 INR to Wankhede Stadium pitch curator: రెండు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా  (Team India) 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం భారత జట్టు యాజమాన్యం వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌ (Wankhede Curator)కు రూ.35 వేల నగదు బహుమతిని అందజేసింది. మూడు రోజుల్లోనే మ్యాచును ముగించే వికెట్‌ను కాకుండా.. స్పోర్టింగ్ వికెట్‌ తయారు చేసినందుకు వాంఖడే పిచ్‌ క్యూరేటర్‌కు టీమిండియా యాజమాన్యం నగదు బహుమానం ఇచ్చింది. వాంఖడే టెస్ట్ చివరి రోజు వరకు కొనసాగనప్పటికీ.. పిచ్ దాని స్వభావానికి అనుగుణంగా ఉంది. మంచి మరియు బౌన్స్‌ను అందించింది.

కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid).. సొంతంగా అక్కడి క్యూరేటర్‌ (Kanpur Pitch Curator)కు నగదు బహుమతిని అందజేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) మ్యాచ్ అనంతరం తెలిపింది. 'మేము ఓ అధికారిక ప్రకటన చేయాలనుకుంటున్నాము. మిస్టర్ రాహుల్ ద్రవిడ్ మా గ్రౌండ్స్‌మెన్‌లకు వ్యక్తిగతంగా రూ.35 వేల నగదు బహుమతిని ఇచ్చారు' అని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. తొలి టెస్ట్ చివరి రోజు వరకు ఉత్కంఠభరితంగా సాగడంతో.. కాన్పూర్‌ పిచ్  క్యూరేటర్‌ పనితీరుకు టీమిండియా కోచ్‌ ఫిదా అయ్యారు. 

Also Read: Pushpa Trailer: పుష్ప ట్రైలర్‌ బాగా నిరాశపరిచింది.. అబ్బే ఊహించినంతగా లేదబ్బా!!

మరోవైపు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ (Ajaz Patel)కు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ (R Ashwin) ప్రత్యేక కానుక అందించాడు. మ్యాచ్‌ ముగిశాక టీమిండియా ఆటగాళ్ల సంతకాలతో కూడిన తన జెర్సీని అతనికి ఇచ్చాడు. 'డ్రెస్సింగ్‌ రూమ్ నుంచి అజాజ్‌ పటేల్ బౌలింగ్‌ను ఎంతో ఆస్వాదించా. టీమిండియా ప్లేయర్స్ అందరూ సంతకాలు చేసిన జెర్సీని నేనే అందుకుంటానేమో అనుకున్నా' అని యాష్ పేర్కొన్నాడు. 'జెర్సీ అందుకున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు' అని అజాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

Also Read: ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయం అందుకుంది. సోమవారం నాలుగో రోజు ఆట ప్రారంభమైన గంటలోపే న్యూజిలాండ్ జట్టు చివరి ఐదు వికెట్లను పడగొట్టిన భారత్.. 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీసేన నంబర్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. కివీస్‌ 121 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు టాప్-5లో ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News