Shoaib Akhtar Comments: భారత ఆటగాళ్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి.. విరాట్ ఇన్‌స్టాకు దూరంగా ఉండాలి!

ఈ రోజు సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ ఫన్నీ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 02:41 PM IST
  • భారత్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన పాకిస్తాన్ బౌలర్
  • టీమిండియాకు నిద్ర మాత్రలు ఇవ్వలంటూ సూచన
  • నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ వీడియో
Shoaib Akhtar Comments: భారత ఆటగాళ్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి.. విరాట్ ఇన్‌స్టాకు దూరంగా ఉండాలి!

 Shoaib Akhtar Funny Comments Give Sleeping Pills to Indian Team: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌.. షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar) సోషల్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో మన అందరికీ తెలిసిందే! క్రికెట్ పై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటూ ఉంటారు. చిరకాల ప్రత్యర్థులైన పాకిస్తాన్ - ఇండియా (India Vs Paksitan) మ్యాచ్ సాయంత్రం జరగనుండగా షోయబ్‌ అక్తర్‌ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే హార్బజన్ సింగ్ (Harbhajan Singh)- షోయబ్‌ అక్తర్‌ ఆన్ లైన్ ఇంటర్వ్యూ లో పాల్గొనగా.. యాంకర్ అడిగిన ప్రశ్నకు ఫన్నీగా సమాధానం చెప్పారు షోయబ్‌ అక్తర్‌. టీమిండియాకు నిద్ర మాత్రలు ఇవ్వండి అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.. 

Also Read: Nivetha Thomas: వకీల్ సాబ్ భామ సాహసం.. కిలిమంజారోను అధిరోహించిన నివేదా థామస్..

స్పోర్ట్స్ కీడా క్రికెట్ (Sports Keeda kriket) ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.. ఇందులో భాగంగా యాంకర్ మొదట షోయబ్‌ అక్తర్‌ను టీమిండియాని నిలువరించాలంటే పాకిస్తాన్ (Pakistan) చేయాల్సిన మూడు పనులేంటి అని అడిగింది. దీనికి షోయబ్‌ అక్తర్‌... 

"మొదటగా టీమిండియా (Team India) ప్లేయర్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి.. రెండోది విరాట్ కోహ్లీ (Virat Kohi) రెండు రోజులు ఇన్‌స్టాగ్రామ్ వాడటం మాన్పించాలి.. మూడోది ఇప్పటికీ అత్యుత్తమ ఫామ్ లో ఉన్న మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) బ్యాటింగ్ కు రాకుండా చూసుకోవాలని" సంభాషించాడు. 

Also Read: Tamannaah Bhatia: జెమిని టీవీపై తమన్నాకు కోపమొచ్చింది

ఈ మూడు పాయింట్లు చెప్పగానే హార్బజన్ సింగ్, యాంకర్ తెగ నవ్వేశారు.. అదే ప్రశ్నను హర్భజన్ ను అడగ్గా.. "మంచి ప్రారంభం కావాలి... మీ జోన్ లో ఉంటూ కంఫర్ట్ గా ఉండాలి.. ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ అనే ఒత్తిడికి ఎక్కువగా తీసుకోవద్దు.. ఇదొక సాధారణ మ్యాచ్ లా కొనసాగించాలి" అని హార్బజన్ సింగ్ తెలుపారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News