Superstar Rajinikanth: కావ్య మారన్‌ని అలా చూస్తుంటే బాధగా ఉంది.. మంచి ప్లేయర్లను తీసుకో: రజనీకాంత్

Rajinikanth On Kavya Maran: ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఓడిపోయిన సందర్భంగా కావ్యా మారన్‌ను టీవీల్లో చూసి తనకు కూడా బాధేసిందని అన్నారు రజనీకాంత్. వచ్చే సీజన్‌లో అయినా మంచి ఆటగాళ్లను తీసుకుని బరిలోకి దిగాలని సూచించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 29, 2023, 05:23 PM IST
Superstar Rajinikanth: కావ్య మారన్‌ని అలా చూస్తుంటే బాధగా ఉంది.. మంచి ప్లేయర్లను తీసుకో: రజనీకాంత్

Rajinikanth On Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గత కొన్ని సీజన్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) టీమ్ పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు. గ్రూప్‌ దశలోనే ఇంటి ముఖం పడుతోంది. అది కూడా చివరి రెండు స్థానాలకు పోటీ పడుతోంది. చివరి సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని జట్టు ఇతర జట్లకు పెద్దగా పోటీనివ్వలేదు. స్టార్ ప్లేయర్లు ఉన్నా.. జట్టుగా ఆడడంలో విఫలమవుతున్నారు. 

డేవిడ్ వార్నర్‌, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్లను వదులుకున్న తరువాత ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. జట్టు ప్రదర్శనపై నిరాశకు గురవుతూ సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ స్టేడియంలో నిరుత్సాహానికి గురయ్యారు. కావ్య ఫొటోలు నెట్టింట కూడా తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసి అభిమానులు కూడా జాలి పడ్డారు. 

కావ్యా మారన్‌ పరిస్థితిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా టీవీల్లో కావ్యా మారన్‌ను అలా చూసేసరికి తనకు కూడా చాలా బాధేసిందని అన్నారు. హైదరాబాద్ జట్టు‌ వరుసగా ఓడిపోవడంతో ఆమె తీవ్ర నిరుత్సాహానికి గురైందని అన్నారు. భవిష్యత్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచించారు. 

జైలర్ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ రజనీకాంత్ మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లను ఉంచాలని కోరారు. జైలర్ మూవీ ఆగస్టు 10న బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. కళానిధి మారన్ నిర్మాత వ్యవహరించారు. నెలన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓనర్. ఈ నేపథ్యంలోనే రజనీ ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ గురించి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

టీమ్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో కోచింగ్ డిపార్ట్‌మెంట్‌లో మార్పులు చేయనుంది. కోచ్ బ్రయాన్ లారాను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లారా కూడా జట్టు నుంచి దూరమవ్వాలని అనుకుంటున్నారు. ఈ దిగ్గజం ప్లేస్‌ లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read: Revanth Reddy: సీఎం, మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారు.. పిండ ప్రదానం చేయండి: రేవంత్ రెడ్డి  

Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News