రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ అద్భుత విజయం..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది.

Last Updated : Apr 10, 2018, 04:21 PM IST
రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ అద్భుత విజయం..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. మొదటి మ్యాచ్‌లోనే రాజస్థాన్‌ రాయల్స్‌పై  9 వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని కైవసం చేసుకుంది. శిఖర్‌ ధావన్‌ (77 నాటౌట్‌; 57 బంతుల్లో 13×4, 1×6) కేవలం 33 బంతుల్లో చేసిన మెరుపు లాంటి అర్థశతకం జట్టుకు నూతనోత్సాహాన్ని అందివ్వగా... కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (36 నాటౌట్‌; 35 బంతుల్లో 3×4, 1×6) కూడా రెచ్చి పోవడంతో భారీ స్కోరుని బీట్ చేయడం సన్ రైజర్లకు కష్టమేమీ అనిపించలేదు.

అంతకు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (49; 42 బంతుల్లో 5×4) ఒక్కడే ఆ జట్టులో నిలకడగా ఆడుతూ పరుగులను వరదలా పారించాడు. ఆ తర్వాత వచ్చిన వారందరూ దాదాపు విఫలమయ్యారు.  రహానె (13), రాహుల్‌ త్రిపాఠి (17) మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ విధంగా ఆడారు. ఇక హైదరాబాద్‌ బౌలర్లలో షకిబ్‌ అల్‌ హసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

Trending News