కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కోల్‌కతా గడ్డపైనే ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం

Last Updated : Apr 15, 2018, 06:12 AM IST
కోల్‌కతా నైట్ రైడర్స్‌ను కోల్‌కతా గడ్డపైనే ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2018లో భాగంగా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 10వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 138 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్వల్ప స్కోరుని ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్  హైదరాబాద్ జట్టు మరో ఓవర్ మిగిలివుండగానే కేవలం 5 వికెట్ల నష్టానికే 139 పరుగులు పూర్తి చేసి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుపై ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన జోష్‌లో వున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌‌పై గెలుపుతో హ్యాట్రిక్ సొంతం చేసుకోవడం విశేషం.

ఇదిలావుంటే, ఇప్పటికే చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైన కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఈసారి సొంతగడ్డపైనే ఓటమిని చవిచూసింది. 

Trending News