Sourav Ganguly discharged from Hospital | కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ (West Bengal) కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ (Woodlands Hospital Kolkata) ఆసుపత్రిలో గత శనివారం (జనవరి 2న) చేరిన సంగతి తెలిసిందే. తాజగా గురువారం దాదా (Sourav Ganguly discharged) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. తనకు చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. చికిత్స అనంతరం తాను పూర్తిగా బాగున్నానంటూ గంగూలీ మీడియాకు వెల్లడించారు.
West Bengal: BCCI President Sourav Ganguly discharged from Woodlands Hospital in Kolkata.
He says, "I thank the doctors at the hospital for the treatment. I am absolutely fine." pic.twitter.com/snnV96LjL9
— ANI (@ANI) January 7, 2021
అయితే ఆసుపత్రిలో చేరిన అనంతరం వూడ్ల్యాండ్స్ వైద్యులు గంగూలీ (Sourav Ganguly) గుండెకు యాంజియోప్లాస్టీ నిర్వహించి మూడు స్టెంట్లు వేశారు. అయితే ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఇంటినుంచి పర్యవేక్షించనున్నారు. ఆసుపత్రి నుంచి గంగూలీ ఇంటికి చేరడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. Also Read: Sourav Ganguly Health Updates: గంగూలీకి పూర్తయిన యాంజియోప్లాస్టీ
#WATCH | "I thank the doctors at the hospital for the treatment. I am absolutely fine," says BCCI President Sourav Ganguly after being discharged from Kolkata's Woodlands Hospital. pic.twitter.com/BUwsz5h1FQ
— ANI (@ANI) January 7, 2021
గంగూలీ కోలుకోవాలంటూ అంతకుముందు రాజకీయ నేతలు, టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు, ఆయన అభిమానులు ట్విట్లు చేసిన సంగతి తెలిసందే. Also read: Sourav Ganguly: దాదాకు గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe