Smriti Mandhana says Team India will win medal at CWG 2022: తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడబోతున్న టీమిండియా మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన భావోద్వేగం చెందారు. ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటివి టీవీల్లోనే చూశానని.. ఇప్పుడు ఏకంగా క్రికెట్ ఆటతో బరిలోకి దిగున్నానని తెలిపారు. పోడియంపై స్వర్ణ పతకం అందుకుంటూ జాతీయ గీతం వినాలనే కోరికను తప్పకుండా నెరవేర్చుకుంటామని స్మృతీ ధీమా వ్యక్తం చేశారు. మహిళా క్రికెట్ చరిత్రలో తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టు బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022 జూలై 28 నుంచి మొదలు కానున్నాయి. మహిళల టీ20 క్రికెట్, బీచ్ వాలీబాల్, బాస్కెట్‌బాల్ మరియు పారా టేబుల్ టెన్నిస్ లాంటి గేమ్స్ ఈసారి భాగమయ్యాయి. దాదాపు 24 ఏళ్ల తర్వాత క్రికెట్‌కు కామన్వెల్త్ గేమ్స్‌లో చోటు దక్కింది. చివరిసారిగా 1998లో పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. అప్పట్లో అన్ని దేశాల్లో క్రికెట్ లేకపోవడం, 50 ఓవర్ల మ్యాచ్‌లు కావడంతో కామన్వెల్త్ క్రీడల్లో చోటు కల్పించలేదు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ రావడంతో.. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు క్రికెట్‌ను ప్రవేశపెట్టారు.
శుక్రవారం (జులై 29) ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. మ్యాచ్ నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న స్మృతీ మంధాన మాట్లాడుతూ... 'కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటివి టీవీల్లోనే చూశా. ఇప్పుడు క్రికెట్ కారణంగా బరిలోకి దిగుతున్నా. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో భాగం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మన జాతీయ జెండా పైకి ఎగురుతూ.. జాతీయ గీతం ఆలపిస్తుంటే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. అందుకోసం బంగారు పతకం సాధించడంపైనే దృష్టి పెట్టాం. భారత జట్టుతో పాటు నాకు ఇదంతా కొత్తగా ఉంది . ఇప్పటివరకు వేరే క్రీడలతో కలిసి ఉన్న ఇలాంటి పెద్ద టోర్నమెంట్‌లో ఆడిన అనుభవం మాకు లేదు. తప్పకుండా పతకం సాధిస్తామనే నమ్మకం ఉంది' అని అన్నారు.
భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ఎస్ మేఘన, తనియా భాటియా, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా.
Also Read: Vedhika Hot Pics: వేదిక అందాల వేడుక.. సముద్రంలో సాగర కన్యలా వయ్యారాలు ఒలకబోస్తూ..!
Also Read: Rukshar Dhillon Pics: బ్రాలో రెచ్చిపోయిన రుక్సర్ ధిల్లాన్.. అంతా కనిపించేలా పోజులు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook