బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన: టాప్‌లెస్‌గా టెన్నిస్ స్టార్

బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన: టాప్‌లెస్‌గా టెన్నిస్ స్టార్

Last Updated : Oct 1, 2018, 01:02 PM IST
బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన: టాప్‌లెస్‌గా టెన్నిస్ స్టార్

టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌  సెరెనా విలియమ్స్‌ సంచలనం రేపింది. రొమ్ము క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి టాప్ లెస్ గా పాట పాడింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

రొమ్ము క్యాన్సర్‌పై ప్రజలపై అవగాహన కల్పించడానికి సెరెనా విలియన్స్ ఆదివారం ఐ టచ్‌ మైసెల్ఫ్‌ అనే గీతాన్ని ఆలపిస్తూ.. టాప్‌లెస్‌గా వీడియోలో కన్పించింది. వీడియోలో సెరీనా తన రొమ్ములను చేతులతో కప్పుకొని కన్పించింది. సెరెనా ఈ పాటతో పాటు.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశాన్ని పోస్ట్‌ చేసింది.

'ఐ టచ్‌ మై సెల్ఫ్‌ అన్న పాటని ఆస్ట్రేలియన్‌ మహిళా రచయిత క్రిస్సి అంఫ్‌లెట్‌ రాసింది. ఐదేళ్ల క్రితం ఆమె తన 53వ ఏట రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. మళ్లీ ఈ పాటని ఆమె గౌరవార్థం ఆలపించి మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగా హన కల్పిస్తున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉంది. ఆమె మరణిస్తూ ఈ పాటని మనకందించి ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది' సెరీనా వివరించింది.

కాగా సెరీనా గీతాన్ని పోస్ట్‌ చేసిన 10 గంటల్లోపే మిలియన్ మంది నెటిజన్లు దీన్ని ఇంటర్నెట్ లో చూసేశారు.

ఇటీవల జరిగిన టెన్నిస్‌లో అంపైర్లు మహిళా క్రీడాకారిణులపై వివక్షత చూపుతున్నారన్న ఆరోపణలతో సెరెనా వార్తల్లో నిలిచింది. టెన్నిస్‌లో పురుషులు కోర్టులో టీ-షర్ట్‌ మార్చుకుంటే ఏమనని వాళ్లు మహిళలు మార్చుకుంటే కోడ్‌ను ఉల్లంఘింఛారంటూ గగ్గోలు పెడ్తున్నారని విమర్శించింది. అంతేనా మొన్న జరిగిన యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒసాకాతో ఆడుతున్న సమయంలో అంపైర్‌ తనను వేరు దృష్టితో చూశాడని ఆరోపించింది.

 

Trending News