India Semifinal Equations: T20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాయి. గ్రూప్ దశ ముగిసిన తర్వాత 4 జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు జరగనుంది. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. గ్రూప్-2 నుంచి ఏ జట్లు సెమీస్‌కు చేరుతాయని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లతో టాప్-4 జట్లు ఏవో తేలిపోనున్నాయి.
ప్రస్తుతం ఆరు పాయింట్లతో టీమిండియా టాప్ ప్లేస్‌లో ఉండగా.. దక్షిణాఫ్రికా ఐదు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ చెరో నాలుగు పాయింట్లు, జింబాబ్వే మూడు, నెదర్లాండ్స్ 2 పాయింట్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకున్నాయి. బంగ్లాదేశ్‌కు కూడా దాదాపు దారులు మూసుకుపోయాయి. ఇక సౌతాఫ్రికా జట్టుకు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్ జట్టును ఓడిస్తే ఆ టీమ్ నేరుగా సెమీస్‌కు చేరుతుంది. జింబాబ్వే చేతిలో భారత్ ఓడిపోయి.. బంగ్లాదేశ్‌పై పాక్ గెలిస్తే నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది.
టీమిండియాలో సెమీస్‌కు చేరితే ఎవరితో తలపడుతుందో ఓసారి చూద్దాం. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇంగ్లాండ్, కివీస్ జట్లు చెరో పాయింట్లతో ఉన్నాయి. న్యూజిలాండ్ మొదటి ప్లేస్‌తో, ఇంగ్లాండ్ సెకెండ్ ప్లేస్‌తో టాప్-4లోకి దూసుకెళ్లాయి. ఆసీస్ కూడా 7 పాయింట్లను కలిగి ఉన్నా..నెట్‌రన్ రేట్‌లో వెనుకబడి ఉండటంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ప్రస్తుతం గ్రూప్ 2లో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లు సాధించింది. ఆదివారం టీ20 ప్రపంచకప్‌లో భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 8 పాయింట్లు సాధించి గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడే అవకాశం ఉంది. ఒకవేళ రెండోస్థానంతో సెమీస్‌కు చేరితే.. న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది.
సెమీ ఫైనల్ 1- న్యూజిలాండ్ Vs గ్రూప్-2 నంబర్ 2 టీమ్ (నవంబర్ 9, సిడ్నీ)
సెమీ ఫైనల్ 2- గ్రూప్-2 టాపర్ టీమ్ Vs ఇంగ్లాండ్ (నవంబర్ 10, అడిలైడ్)
Also Read: Munugode By Election Results: మునుగోడు మొనగాడు ఎవరో..? అందరిలోనూ ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ఇలా..
Also Read: England Vs Sri Lanka: టీ20 వరల్డ్‌కప్ నుంచి ఆసీస్ ఔట్.. లంకేయులు చిత్తు.. ఇంగ్లాండ్ సెమీస్‌కు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి