Jos Buttler Century: ఐపీఎల్ 2022లో బట్లర్‌ రెండో సెంచరీ.. గేల్, కోహ్లీ సరసన ఇంగ్లండ్ ప్లేయర్! పలు రికార్డులు ఇవే

Jos Buttler slams second century in IPL 2022. ఐపీఎల్ 2022లో జోస్‌ బట్లర్‌ రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గత 23 టీ20 ఇ‍న్నింగ్స్‌లలో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2022, 11:17 PM IST
  • జోస్‌ బట్లర్‌ సెంచరీ
  • ఐపీఎల్ 2022లో బట్లర్‌ రెండో సెంచరీ
  • బట్లర్‌ పలు రికార్డులు ఇవే
Jos Buttler Century: ఐపీఎల్ 2022లో బట్లర్‌ రెండో సెంచరీ.. గేల్, కోహ్లీ సరసన ఇంగ్లండ్ ప్లేయర్! పలు రికార్డులు ఇవే

Jos Buttler slams second century in IPL 2022 to join Virat Kohli elite list: ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్ 15లో ఇప్పటికే సెంచరీ బాదిన బట్లర్‌.. నేడు మరొకటి బాదాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. పేసర్ పాట్‌ కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ తొలి బంతిని భారీ సిక్సర్‌ బాదిన బట్లర్‌.. 59 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఈ సెంచరీతో ఇంగ్లండ్ ప్లేయర్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

జోస్‌ బట్లర్‌ ఐపీఎల్ 2022లో తొలి సెంచరీని ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అందుకోగా.. కోల్‌కతాపై రెండో సెంచరీ నమోదు చేశాడు. దాంతో మెగా టోర్నీలో మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గత 23 టీ20 ఇ‍న్నింగ్స్‌లలో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ. గత ఏడు ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ మూడు సార్లు సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. 

ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా బ్రబౌర్న్‌ మైదానంలో శతకం బాదిన నాలుగో ఆటగాడిగా జొస్ బట్లర్‌ రికార్డు నెలకొల్పాడు. గతంలో యూసఫ్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, కేఎల్‌ రాహుల్‌ బ్రబౌర్న్‌ మైదానంలో సెంచరీ చేశారు. ఇక ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు బాదిన బ్యాటర్ జాబితాలోనూ ఇంగ్లండ్ ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 4 సెంచరీల బాదగా.. శిఖర్ ధావన్ (2020), షేన్ వాట్సన్ (2018), హాషిమ్ ఆమ్లా (2017), క్రిస్ గేల్ (2011) ఈ జాబితాలో ఉన్నారు. 

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్  20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (103; 61 బంతుల్లో 9x4, 5x6) సెంచరీతో చెలరేగాడు. సంజు శాంసన్ (38), షిమ్రాన్ హెట్మెయర్ (26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కోల్‌కతా బౌలర్ సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా  15 ఓవర్లలో నాలుగు వికెట్లను 164 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 30 బంతుల్లో 51 రన్స్ చేయాలి. 

Also Read: Buttler-Padikkal: ఏమా పరుగు.. ఒక బంతికి నాలుగు పరుగులు తీసిన బట్లర్, పడిక్కల్!

Also Read: Cancel IPL: ఐపీఎల్ 2022ని క్యాన్సిల్ చేయండి.. డిమాండ్ చేస్తున్న ఆ రెండు జట్ల ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News