India Captain Rohit Sharma says Iam not worried about my Current Form: భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసి యాభైకి పైగా ఇన్నింగ్స్‌లు అయ్యాయి. చివరిసారిగా సెప్టెంబర్ 2021లో ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో శతకం బాదాడు. 2021లో టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇప్పటివరకు భారత కెప్టెన్‌గా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. పలు మ్యాచ్‌ల్లో శుభారంభాలు వస్తున్నా.. గతంలో లాగా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 41 సెంచరీలు చేయగా.. వాటిలో 29 వన్డేలలో ఉన్నాయి. చివరగా జనవరి 2020లో వన్డేలలో సెంచరీ చేశాడు.
ఇటీవలి కాలంలో సెంచరీలు చేయకపోయినా తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని, తన బ్యాటింగ్‌తో సంతృప్తిగానే ఉన్నానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 'నేను నా గేమ్‌ను మార్చుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నా. ఒత్తిడి తేవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఇక గత కొంతకాలంగా నా నుంచి పెద్ద స్కోర్లు రాలేదని తెలుసు. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా బ్యాటింగ్‌తో ఆనందంగానే ఉన్నా. అయితే నా బ్యాటింగ్ అప్రోచ్‌ను మాత్రం నాతోనే ఉంచుకున్నా. భారీ స్కోరు బాకీ ఉన్నాను' అని రోహిత్ అన్నాడు.
వన్డే మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌లలో రోహిత్ శర్మ నాల్గవ స్థానంలో ఉన్నాడు. మరో రెండు శతకాలు చేస్తే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (30) సెంచరీల రికార్డును బద్దలు కొట్టి మూడవ స్థానానికి చేరుకుంటాడు. భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్ (49), విరాట్ కోహ్లీ (46) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ (51) హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాంతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరిదైన వన్డే ఇండోర్ వేదికగా మంగళవారం జరగనుంది.
'గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇలాంటి ఫలితం కావాలని అడిగితే.. వెంటనే చేస్తున్నారు. భారత్ వేదికగా సూపర్ బౌలింగ్ చేశారు. విదేశాల్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిసారని అనుకుంటున్నా. భారత బౌలర్లు ఉత్తమ నైపుణ్యం కలిగిన ప్లేయర్స్. కివీస్‌తో రెండో వన్డేలో అదరగొట్టారు. ఈ పిచ్‌పై 250 పరుగులైనా ఛేదించగలమని భావించాం. బౌలర్లు బాగా బౌలింగ్ చేసి కివీస్‌ను తక్కువ పరుగులకే కుప్పకూల్చారు. మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ లాంగ్ స్పెల్ వేయడానికి ఇష్టపడుతున్నారు. టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో పూర్తి ఓవర్లు బౌలింగ్ వేయించలేదు' అని రోహిత్ శర్మ చెప్పాడు.
Also Read: Vivo 5G Smartphone: వివో అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్.. సూపర్ లుకింగ్! ఎగబడి కొంటున్న జనాలు
Also Read: Jio Cheape Recharge Plan: జియో 'సూపర్' ప్లాన్.. ఎయిర్‌టెల్ వినియోగదారులు అసూయపడక తప్పదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.