Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్.. అనిల్ కుంబ్లే రికార్డులు బద్దలు

Ravichandran Ashwin Breaks Anil Kumble Records: ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ చెలరేగుతున్నాడు. చివరి టెస్టు మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డులను దాటేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 10:32 PM IST
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్..  అనిల్ కుంబ్లే రికార్డులు బద్దలు

Ravichandran Ashwin Breaks Anil Kumble Records: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అదేవిధంగా భారత్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఈ రెండు రికార్డులు గతంలో అనిల్ కుంబ్లే పేరిట ఉండగా.. అశ్విన్ బద్దలు కొట్టాడు. 

టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఆస్ట్రేలియాపై 111 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో‌ అశ్విన్ ఆరు వికెట్లు తీసి 113 తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో జరిగిన 26 మ్యాచ్‌ల్లో 46 ఇన్నింగ్స్‌ల్లోనే అశ్విన్‌ ఈ వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ సగటు 31.92గా ఉంది. కుంబ్లే మరో రికార్డుపై కూడా అశ్విన్ కన్నేశాడు. భారత్‌లో అనిల్ కుంబ్లే 115 ఇన్నింగ్స్‌ల్లో 350 వికెట్లు తీయగా.. అశ్విన్ 106 ఇన్నింగ్స్‌ల్లో 336 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో మరో అశ్విన్ 15 వికెట్లు తీస్తే ఈ రికార్డు కూడా బద్దలు అవుతుంది. 

అదేవిధంగా అశ్విన్ స్వదేశంలో టెస్టు క్రికెట్‌ ఫార్మాట్‌లో మొత్తం 26 సార్లు 5 వికెట్లు తీశాడు. గతంలో అనిల్ కుంబ్లే స్వదేశంలో మొత్తం 25 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అహ్మదాబాద్ టెస్టులో అశ్విన్ 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో అత్యధికసార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో అశ్విన్ ఇప్పటివరకు 473 వికెట్లు తీశాడు. 113 వన్డేల్లో 151 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు, 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 157 వికెట్లు పడగొట్టాడు.

అహ్మదాబాద్‌ టెస్టులో ప్రస్తుతం ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో  480 పరుగులకు ఆలౌట్ అయింది. కంగారూ జట్టుకు భారత్‌ కూడా దీటుగా సమాధానం ఇస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. మూడోరోజు మొత్తం భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తే.. మ్యాచ్ రసవత్తరంగా మారనుంది.

Also Read: Ind Vs Aus: సేఫ్ జోన్‌లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు.. భారత్ గెలవాలంటే..!  

Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News