KXIP vs RR match: పంజాబ్ దూకుడుకు రాజస్థాన్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

ఐపిఎల్ 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌‌పై ( Kings XI Punjab ) రాజస్థాన్‌ రాయల్స్‌ ( Rajasthan Royals ) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది.

Last Updated : Oct 31, 2020, 01:55 AM IST
KXIP vs RR match: పంజాబ్ దూకుడుకు రాజస్థాన్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

అబుదాబి : ఐపిఎల్ 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌‌పై ( Kings XI Punjab ) రాజస్థాన్‌ రాయల్స్‌ ( Rajasthan Royals ) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి వచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 3 వికెట్లు కోల్పోయి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఈ విజయంతో ప్లే ఆఫ్స్‌పై ( Playoffs in IPL 2020 ) ఆశలు సజీవం చేసుకుంది. Also read : Gayle 1000 Sixes: టీ20ల్లో 1000 సిక్సులు కొట్టిన ఏకవీరుడు క్రిస్ గేల్

బెన్‌స్టోక్స్‌ ( Ben Stokes 50 పరుగులు: 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శాంసన్‌ ( Sanju Samson 48 పరుగులు: 25 బంతుల్లో  4 ఫోర్లు, 3 సిక్సర్లు) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జట్టుకు విజయం అందించారు. రాబిన్‌ ఉతప్ప (30), స్టీవ్‌ స్మిత్‌ (31 నాటౌట్‌), జోస్‌ బట్లర్‌ (22 నాటౌట్‌) సమష్టి కృషితో రాజస్థాన్ రాయల్స్ సునాయసంగానే గెలుపొందింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ షమి, మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డన్ ధారళంగా పరుగులు సమర్పించుకోగా రవి బిష్ణోయ్ (Ravi Bishnoi ) మాత్రమే 4 ఓవర్లు వేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. మురుగన్‌ అశ్విన్‌, జోర్డాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో క్రిస్‌గేల్‌ ( Chris Gayle 99 పరుగులు: 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగిపోయి కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ( KL Rahul 46 పరుగులు: 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, నికోలస్‌ పూరన్‌ ( Nicholas Pooran 22 పరుగులు: 10 బంతుల్లో 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌ ( Jofra Archer చెరో రెండు వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లోనూ మెరిసిన బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. Also read : CSK vs KKR match: చివరి బంతి వరకు తప్పని సస్పెన్స్.. కోల్‌కతాపై చెన్నై విజయం

ఈ ఓటమితో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ జట్టు దూకుడుకు బ్రేకులేసినట్టయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్లు నెట్ రన్ రేట్‌తో 14 పాయింట్స్‌‌తో కొనసాగుతుండగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( KXIP), రాజస్థాన్ రాయల్స్ RR), కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) జట్లు 12 పాయింట్స్‌తో సమ స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో ఇకపై జరగనున్న మ్యాచ్‌ల్లో జట్లకు భారీ విజయాలు అవసరం కానున్నాయి. Also read : SRH vs DC Match IPL 2020: ఢిల్లీని చిత్తు చేసిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News