భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఇండియా అండర్-19 జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరో అరుదైన ఘనత సాధించాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన 'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో ద్రవిడ్‌కు చోటు లభించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈ ఘనత దక్కించుకున్న ఐదో భారత ఆటగాడు ద్రవిడ్. ఈ మేరకు దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్‌కు 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కిందన్న విషయాన్ని ఐసీసీ చీఫ్ ఎగ్జిక‍్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశారు.
ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ క్లెయిర్ టేలర్‌లకు 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. ద్రవిడ్ కంటే ముందే బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేలు భారత తరపున 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ఉన్నారు.
The Wall is in The Hall!
Here's his #ICCHallOfFame cap 👀 pic.twitter.com/gbn5aA1G4J— ICC (@ICC) July 1, 2018
'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కడంపై రాహుల్ ద్రవిడ్ స్పందించారు. 'ఇదొక గొప్ప గౌరవం. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోవాలనేది ప్రతీ ఒక్కరి స్వప్నం. ఈ గౌరవం కచ్చితంగా ఏ ఆటగాడి జీవితంలోనైనా రెట్టింపు సంతోషాన్ని తెస్తుంది’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
క్రికెట్ ఆటలో దిగ్గజ ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో వారికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం కల్పించడాన్ని గౌరవం ఇస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి ఇచ్చే గుర్తింపు ఇది.