Ben Stokes: ఇయాన్ మోర్గాన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదన్న బెన్ స్టోక్స్

Pakistan vs England 2021:పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఇంగ్లాండ్ జట్టు, సహాయక సిబ్బంది మొత్తం ఏడుగురిని కోవిడ్19 పాజిటివ్ అని నిర్ధారించారు. మొత్తం జట్టు ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఒకరోజు తరువాత వెలుగుచూసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 7, 2021, 04:28 PM IST
  • ఇంగ్లాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్
  • ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు తాత్కాలిక సారథిగా బాధ్యతలు అప్పటించిన ఈసీబీ
  • మొత్తం 9 మంది కొత్త ఆటగాళ్లతో రంగంలోకి దిగనున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు
Ben Stokes: ఇయాన్ మోర్గాన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదన్న బెన్ స్టోక్స్

Pakistan vs England 2021: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఇంగ్లాండ్ జట్టు, సహాయక సిబ్బంది మొత్తం ఏడుగురిని కోవిడ్19 పాజిటివ్ అని నిర్ధారించారు. మొత్తం జట్టు ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఒకరోజు తరువాత వెలుగుచూసింది.

రెగ్యూలర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ జట్టుకు తాత్కాలికంగా దూరం కావడంతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించారు. దీనిపై బెన్‌స్టోక్స్ స్పందించాడు. ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు తాను నిర్వర్తించడం కష్టతరమేనని, కానీ ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు గౌరవప్రదంగా ఉందన్నాడు. ముగ్గురు క్రికెటర్లు, నలుగురు సహాయక సిబ్బంది కరోనా (Covid-19 Positive Cases In England Team) బారిన పడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందన్నాడు. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో తాను జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నానని పేర్కొన్నాడు. మోర్గాన్, జాస్ బట్లర్ సేవలు అందుబాటులో లేని సమయంలో కెప్టెన్‌గా వ్యవహరించడం అంత తేలిక కాదన్నాడు.

Also Read: COVID-19: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం, మొత్తం 7 మందికి కరోనా పాజిటివ్

గత ఏడాది టెస్టు జట్టును నడిపించిన తీరుగా ఇంగ్లాండ్ జట్టుకు సారథిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాను. కోవిడ్19 (Corona third wave) కేసులు త్వరగానే తగ్గిపోతాయని భావిస్తున్నాను. మూడు రోజులకు సరిపడ దుస్తులు మాత్రమే తెచ్చుకున్నాను. కనుక డ్రెస్సులు వాష్ చేసుకోవాల్సి వస్తుందని ద మిర్రర్ కాలమ్‌లో బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ తాను వన్డే సిరీస్‌కు సంబంధించి ఎలాంటి కిట్ అందుకోలేదని తెలిపాడు.

9 మంది వరకు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. 20 మంది ఆటగాళ్లు ఐసోలేషన్ లేదా గాయాలతో ఉన్నారు. కొత్త వారికి తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశమని బెన్ స్టోక్స్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు. గురువారం నాడు కార్డిఫ్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ బర్త్‌డే, టీమిండియా మాజీ కెప్టెన్‌కు శుభాకాంక్షల వెల్లువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News