England Vs Pakistan Highlights: సొంత గడ్డ మీద ఇంగ్లాండ్ చేతిలో ఊహించని పరాజయం పాలైన పాకిస్థాన్.. అన్ని వైపులా నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కరాచీ టెస్టులోనూ ఓడి.. ఇంగ్లండ్‌కు 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో తొలిసారి టెస్టులు పాక్ జట్టు క్లీన్ స్వీప్‌కు గురైంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన పాక్.. చరిత్రలో మరిచిపోలేని పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాజీ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిప్తున్నారు.
పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బాబర్ ఆజామ్‌పై తన యూట్యూబ్ ఛానెల్‌లో ఫైర్ అయ్యారు. ప్రస్తుత పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌లో ఏ ఆటగాడిని భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారితో పోల్చకూడదన్నారు. మూడో టెస్టులో బాబర్ నేతృత్వంలోని పాక్ జట్టును ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో సొంతగడ్డపై ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో కనేరియా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రజలు విరాట్ కోహ్లీతో బాబర్ అజామ్‌ను పోల్చడం మానేయాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారు భారీ ఆటగాళ్లు. పాకిస్థాన్ జట్టులో వారితో పోల్చదగిన వారు ఎవరూ లేరు. వాళ్లను మాట్లాడేలా చేస్తే వాళ్లు రాజు అవుతారు.. ఫలితాలను ఇవ్వమని మీరు వారిని అడగండి, అవి సున్నాగా ఉంటాయి. బాబర్ అజామ్ కెప్టెన్‌గా శూన్యం. అతనికి జట్టును నడిపించే సామర్థ్యం లేదు. అర్హత లేదు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే అతను బెన్ స్టోక్స్‌ను చూసి కెప్టెన్సీ నేర్చుకునే మంచి అవకాశం ఉంది. బాబర్ తన అహాన్ని పక్కనపెట్టి.. సర్ఫరాజ్ అహ్మద్‌ని కెప్టెన్‌గా ఎలా ఆడాలో అడగవచ్చు.." అని డానేష్ కనేరియా సూచించారు.
17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్‌కు వచ్చిన ఇంగ్లండ్.. మూడు టెస్టుల్లోనూ ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన పాక్.. టెస్ట్ సిరీస్‌లోనూ వరుసగా ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. తొలి టెస్టులో 74 పరుగుల తేడాతో విజయం సాధించగా.. రెండో టెస్టు మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది. చివరి టెస్టులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ 3-0 తేడాతో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది.
Also Read: India Covid Update: మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
Also Read: Coronavirus In China: చైనాలో మళ్లీ కరోనా విలయతాండవం.. లక్షల్లో మరణాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook