Deepak Chahar Tears: కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్.. కారణం ఏంటంటే? (వీడియో)!!

Deepak Chahar Tears. మూడో వన్డేలో భారత పేసర్ దీపక్ చహర్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. హాఫ్ సెంచరీ బాదినా మ్యాచ్ ఓడిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 09:58 AM IST
  • మూడో వన్డేలో ఓడిపోయిన భారత్
  • దీపక్ చహర్ హాఫ్ సెంచరీ
  • కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్
Deepak Chahar Tears: కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్.. కారణం ఏంటంటే? (వీడియో)!!

 Deepak Chahar Crying after India defeated by South Africa: మూడు వన్డే మ్యాచుల సిరీసులో భాగంగా కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మూడో వన్డే (IND vs SA 3rd ODI)లో భారత్ (India) ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా (South Africa) 287 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులు చేసింది. అయితే మూడో వన్డేలో ఓ దశలో భారత్ గెలుపొందినట్లే కనిపించినా.. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచును దూరం చేశారు. 

లక్ష ఛేదనలో భారత ఇన్నింగ్స్ పడుతూలేస్తూ సాగింది. 43వ ఓవర్లలో 7వ వికెట్ పడగానే.. జస్ప్రీత్ బుమ్రా అండతో దీపక్ చహర్‌ (Deepak Chahar) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. బుమ్రా రాగానే దీపక్ దూకుడు ప్రదర్శించాడు. వరుస బౌండరీలతో (2 సిక్సర్లు, 5 ఫోర్లు) రెచ్చిపోయాడు. భారత్ 223 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ.. దీపక్ హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ గమనాన్ని మార్చాడు. దాంతో అందరిలో భారత్ గెలుపై ఆశలు చిగురించాయి. అయితే అయితే 48వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

Also Raed:  BSNL Unlimited Plans: రూ.200 కంటే తక్కువ ధరకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా

48వ ఓవర్ మొదటి బంతికి దీపక్ చహర్‌ క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో బౌండరీ ఆవల ఉన్న కుర్చీపై కూర్చుని మ్యాచ్ చూడసాగాడు. దీపక్ ఔట్ అవ్వగానే భారత్ విజయవకాశాలు సన్నగిల్లాయి. 49వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వికెట్ పడగానే దీపక్ తనను తాను తిట్టుకోవడం లైవ్‌లో కనిపించింది. ఇక చివరి ఓవర్‌లో యుజ్వేంద్ర చహల్ వికెట్ పడిపోవడంతో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో దీపక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. హాఫ్ సెంచరీ బాదినా మ్యాచ్ ఓడిపోవడంతో కన్నీళ్లు (Deepak Chahar Crying) పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా కన్నీరుమున్నీరు అయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 

Also Read: Dhawan - Kohli: ధోనీ - రైనా రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ - ధావన్​.. టాప్‌లో గంగూలీ - సచిన్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News